(1 / 6)
కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ మూవీ మౌత్ టాక్‌తోనే ఎంతో పబ్లిసిటీ సంపాదించింది. అలాగే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
(2 / 6)
చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాంతో మాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త మైలురాయిని అందుకుంది.
(3 / 6)
ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ. 200 కోట్ల మార్కును దాటింది. దీంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో 200 కోట్ల మార్క్ దాటిన చిత్రాల్లో ఒకటిగా మంజుమ్మేల్ బాయ్స్ నిలిచింది.
(4 / 6)
2018లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం అంతకుముందు బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లు వసూలు చేసి రికార్డును బద్దలు కొట్టింది.
(5 / 6)
ఒక్క కేరళలోనే మంజుల బాయ్స్ రూ.70 కోట్లు రాబట్టింది.ఇటీవల విడుదలైన ప్రేమలు కూడా రూ. 109 కోట్లు రాబట్టింది.దీనితో మాలీవుడ్ రంగం నుంచి వరుస హిట్ చిత్రాల ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది.
(6 / 6)
ఆశ్చర్యకరంగా మంజుమ్మేల్ చిత్రాన్ని తమిళంలో కూడా డబ్ చేసి అక్కడ విడుదల చేశారు. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇతర గ్యాలరీలు