Manjummel Boys OTT Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన బ్లాక్‍బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ : వివరాలివే
- Manjummel Boys OTT Streaming: మలయాళ బ్లాక్‍బస్టర్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. దీంతో చాలా మంది ప్రేక్షకుల నిరీక్షణ తీరింది.
- Manjummel Boys OTT Streaming: మలయాళ బ్లాక్‍బస్టర్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. దీంతో చాలా మంది ప్రేక్షకుల నిరీక్షణ తీరింది.
(1 / 5)
మలయాళ ఇండస్ట్రీలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టింది. ఆల్‍టైమ్ కలెక్షన్ల చరిత్ర సృష్టించింది. ఇప్పుడు, ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది.
(2 / 5)
మంజుమ్మల్ బాయ్స్ సినిమా నేడు (మే 5) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
(3 / 5)
మంజుమ్మల్ బాయ్స్ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 22వ తేదీన రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ.200కోట్ల వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ మూవీగా రికార్డు సృష్టించింది. తమిళంలోనూ భారీ వసూళ్లను సాధించింది. తెలుగులోనూ ఏప్రిల్ 6న థియేటర్లలో విడుదలై అదరగొట్టింది.
(4 / 5)
మలయాళంలో థియేటర్లలో రిలీజైన 73 రోజులకు ఈ చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో బంపర్ హిట్ అయిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ అదే రేంజ్‍లో రెస్పాన్స్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు