Waltair Veerayya Collection Day 10: 200 కోట్ల క్ల‌బ్‌లో వాల్తేర్ వీర‌య్య‌ - బాహుబ‌లి -2 త‌ర్వాత చిరంజీవిదే ఈ రికార్డ్‌-chiranjeevi waltair veerayya enters 200 crore club in ten days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Chiranjeevi Waltair Veerayya Enters 200 Crore Club In Ten Days

Waltair Veerayya Collection Day 10: 200 కోట్ల క్ల‌బ్‌లో వాల్తేర్ వీర‌య్య‌ - బాహుబ‌లి -2 త‌ర్వాత చిరంజీవిదే ఈ రికార్డ్‌

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య
చిరంజీవి వాల్తేర్ వీర‌య్య

Waltair Veerayya Collection Day 10: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమా బాహుబ‌లి -2 త‌ర్వాత ప‌దో రోజు బాక్సాఫీస్ వ‌ద్ద హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ప‌ది రోజుల్లో ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

Waltair Veerayya Collection Day 10: చిరంజీవి (Chiranjeevi) వాల్తేర్ వీర‌య్య ప‌ది రోజుల్లో 200 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా వాల్తేర్ వీర‌య్య నిలిచింది. శ‌నివారం నాటితో ఈ సినిమా 200 కోట్ల క‌లెక్ష‌న్ల మైలురాయిని అందుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సైరా న‌ర‌సింహారెడ్డి హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఆ రికార్డ్‌ను వాల్తేర్ వీర‌య్య బ్రేక్ చేసింది. శ‌నివారం రోజు వాల్తేర్ వీర‌య్య సినిమాకు ఆరున్న‌ర కోట్ల వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌దో రోజు బాహుబ‌లి -2 త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా వాల్తేర్ వీర‌య్య‌ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ జాబితాలో ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా వాల్తేర్ వీర‌య్య మూడో ప్లేస్‌లో ఉంది.

ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్‌ల‌లో టాలీవుడ్ నుంచి రెండు వంద‌ల కోట్ల మైలురాయిని అందుకున్న ఏకైక సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఔట్‌ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈసినిమాలో చిరంజీవితో పాటు ర‌వితేజ (Raviteja) మ‌రో హీరోగా న‌టించాడు. టైటిల్ పాత్ర‌లో చిరంజీవి న‌టించ‌గా ఏసీపీ విక్ర‌మ్ సాగ‌ర్ అనే క్యారెక్ట‌ర్‌ను ర‌వితేజ చేశాడు.

ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌న సోద‌రుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన డాన్‌పై వాల్తేర్ వీర‌య్య ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రిన్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. వాల్తేర్ వీర‌య్య సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందించాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.