తెలుగు న్యూస్  /  Entertainment  /  Rakul Preet Singh I Love You Movie Directly Streaming On Jio Cinema Ott Details Here

Rakul Preet Singh: ఈ ఇయ‌ర్ ర‌కుల్ మూడో సినిమా కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే - ఐ ల‌వ్ యూ రిలీజ్ డేట్ ఫిక్స్‌

HT Telugu Desk HT Telugu

05 June 2023, 12:41 IST

  • Rakul Preet Singh: ఛ‌త్రివాలీ, బూ త‌ర్వాత ఈ ఇయ‌ర్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రో మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఆ సినిమా ఏదంటే...

ర‌కుల్ ప్రీత్ సింగ్
ర‌కుల్ ప్రీత్ సింగ్

ర‌కుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: ఇటీవ‌లే బూ సినిమాతో ఓటీటీ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. బూ సినిమాతో ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ జోన‌ర్‌ను ట‌చ్‌చేసింది. తాజాగా ర‌కుల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌రో థ్రిల్ల‌ర్ మూవీ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్న‌ది. ర‌కుల్ ప్రీత్‌సింగ్, ప‌విల్ గులాటీ హీరోహీరోయిన్లుగా ఐ ల‌వ్ యూ పేరుతో ఓ బాలీవుడ్ మూవీ రూపొందుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి నిఖిల్ మ‌హాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఐ ల‌వ్ యూ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. జియో సినిమా ఓటీటీ ద్వారా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప‌విల్ గులాటీ రొమాంటిక్ సీన్స్‌తో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. ఆ త‌ర్వాత ర‌కుల్ ఓ పెద్ద బిల్డింగ్‌లో ఒంట‌రిగా చిక్కుకుపోయిన‌ట్లుగా చూపించారు. ఆమెను బంధించింది ఎవ‌ర‌న్న‌ది ఈ టీజ‌ర్‌లో చూపించ‌లేదు. ఈ టీజ‌ర్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఐ ల‌వ్ యూ మూవీ జూన్‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం.ఛ‌త్రివాలీ, బూ త‌ర్వాత ఈ ఏడాది డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న ర‌కుల్ మూడో సినిమా ఇది. ప్ర‌స్తుతం త‌మిళంలో అయాలాన్‌, ఇండియ‌న్ 2 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.