Boo Movie Review: బూ మూవీ రివ్యూ - విశ్వ‌క్‌సేన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?-boo movie telugu review rakul preet singh vishwak sen horror movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Boo Movie Telugu Review Rakul Preet Singh Vishwak Sen Horror Movie Review

Boo Movie Review: బూ మూవీ రివ్యూ - విశ్వ‌క్‌సేన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 29, 2023 05:41 AM IST

Boo Movie Review: విశ్వ‌క్‌సేన్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, నివేథా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన హార‌ర్ మూవీ బూ జియో సినిమా ఓటీటీ లో రిలీజైంది. ఏ.ఎల్‌. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

బూ మూవీ
బూ మూవీ

Boo Movie Review: ర‌కుల్ ప్రీత్‌సింగ్‌(Rakul Preet Singh), విశ్వ‌క్‌సేన్‌(Vishwak Sen), నివేథా పేతురాజ్(Nivetha Pethuraj) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హార‌ర్ సినిమా బూ(Boo Movie). కోలీవుడ్ వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ ఏ.ఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ ఇటీవ‌ల జియో సినిమా (Jio Cinema) ఓటీటీలో రిలీజైంది. ఇందులో మేఘాఆకాష్‌, మంజిమామోహ‌న్‌, రెబ్బాజ‌న్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన ఈ హార‌ర్ మూవీ ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్టిందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

హాలోవీన్ పార్టీ...

కైరా (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) త‌న ఇంట్లో హ‌లోవీన్ పార్టీని ఏర్పాటుచేసింది. త‌న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అరుణ‌, రుతిక‌, కావ్య‌ల‌ను పార్టీలో భ‌యపెట్టాల‌ని ప్లాన్ చేస్తుంది. న‌లుగురు క‌లిసి హ‌లోవీన్ స్టోరీస్ అనే బుక్ చ‌ద‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. ఆ బుక్ మొద‌లుపెడితే చివ‌రి వ‌ర‌కు చ‌ద‌వాల‌ని కండీష‌న్ ఉంటుంది. ఆ బుక్ లోని నాలుగు క‌థ‌లు చ‌ద‌వ‌డం వ‌ల్ల వారి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి.

జ‌ర్న‌లిస్ట్ (నివేథా పేతురాజ్‌), మాళ‌వికా (మేఘా ఆకాష్‌), జాన‌కి (మంజిమా మోహ‌న్‌)తో పాటు ఆకాష్‌(విశ్వ‌క్‌సేన్‌), మీరా (రెబ్బా జాన్‌) జీవితాలు ద‌య్యాల కార‌ణంగా ఏ విధంగా చిక్కుల్లో ప‌డ్డాయి? వీరింద‌రికి ఆకాష్‌తో ఎలాంటి సంబంధం ఉంది?

కైరా ఇంట్లో హ‌లోవీన్ పార్టీకి వ‌చ్చింది నిజంగా కైరా స్నేహితులేనా? వారు బ‌తికే ఉన్నారా? బుక్‌లోని ఓ పాత్ర‌గా ఉన్న ఆకాష్ చివ‌ర‌కు కైరా జీవితంలోకి ఎలా వ‌చ్చాడు? అన్నే బూ(Boo Movie Review )క‌థ‌.

హాలీవుడ్‌లో ఎక్కువ‌...

హ‌లోవీన్ ట్రెండ్ విదేశాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ క‌ల్చ‌ర్ తో హాలీవుడ్‌లో చాలా హార‌ర్ సినిమాలు రూపొందాయి. ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. ఇండియ‌న్‌స్క్రీన్‌పై మాత్రం హ‌లోవీన్ బ్యాక్‌డ్రాప్‌ను ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేదు. తొలిసారి బూ సినిమాతో ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ విజ‌య్ ఈ జోన‌ర్‌ను ఎంచుకొన్నాడు. నాలుగు వేర్వేరు హార‌ర్ క‌థ‌లు...వాటికి అనుగుణంగా సాగే ఐదో క‌థ తో డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో బూ సినిమాను తెర‌కెక్కించాడు.

నాలుగు క‌థ‌లు...

కైరా హ‌లోవీన్ పార్టీని ఏర్పాటుచేయ‌డం, స్నేహితులు ఆమె ఇంట్లో అడుగుపెట్టే సీన్స్‌తో బూ సినిమా ఆరంభ‌మ‌వుతుంది. వారు హ‌లోవీన్ బుక్ చ‌ద‌వ‌డం స్టార్ట్ చేయ‌డంతోనే సినిమా ఎగ్జైటింగ్‌గా మారుతుంది. ఒక్కో క‌థ ద్వారా ఒక్కో డిఫ‌రెంట్ హార‌ర్ స్టోరీస్‌ను స్క్రీన్‌ఫై ఆవిష్క‌రించారు.

ఫ‌స్ట్ స్టోరీ హిక‌ప్స్ మిడ్‌నైట్ టూలెట్ బోర్డ్ చూసి ఓ పెద్ద ఇంట్లో అద్దెకు దిగిన‌ ఓ జ‌ర్న‌లిస్ట్‌కు ఎదురైన అనూహ్య సంఘ‌ట‌న‌ల చుట్టూ సాగుతుంది. త‌న కారు కింద ప‌డి చ‌నిపోయిన ఓ వృద్ధుడితో పాటు బాలుడు ఆత్మ‌లు మాళ‌వికా అనే అమ్మాయిని వెంబ‌డించ‌డంతో ఏం జ‌రిగింద‌న్న‌ది సోల్ ట్రాప్ ఎపిసోడ్ క‌థ‌లో చూపించారు.

ఇంట్లో ఒంట‌రిగా ఉన్న జాన‌కికి ఓ ఆత్మ ఏ విధంగా చంప‌డానికి ప్ర‌య‌త్నించింద‌న్న‌ది మూడో క‌థ అన్ ఇన్వైటెడ్ గెస్ట్ స్టోరీలో(Boo Movie Review ) ద‌ర్శ‌కుడు థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఆకాష్‌...మీరా...

ఆత్మ‌ క‌థ‌లో ద‌య్యాల‌పై ప‌రిశోధ‌న చేస్తోన్న పారానార్మ‌ల్ సైకాల‌జిస్ట్ ఆకాష్‌, త‌న ప్రియురాలు మీరాతో క‌లిసి ఓ పురాత‌న భ‌వంతిలో అడుగుపెట్ట‌డం, అక్క‌డ మీరా ఎలా ప్రాణాల‌ను కోల్పోయింద‌నే పాయింట్ చుట్టూ న‌డిపించారు.

ఒక్కో క‌థ చ‌ద‌వ‌డం ముగిసిన త‌ర్వాత కైరాతో పాటు ఆమె స్నేహితుల జీవితాల్లో చోటు చేసుకునే గంద‌ర‌గోళంతో ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్టాల‌ని అనుకున్నారు ద‌ర్శ‌కుడు.ఈ ప్ర‌య‌త్నంలో పూర్తిగా స‌క్సెస్ కాలేక‌పోయారు.

ఐడియా బాగుంది కానీ...

హ‌లోవీన్ పార్టీ సెట‌ప్‌, నాలుగు క‌థ‌లు అనే ఐడియా బాగుంది. ఈ క‌థ‌ల్ని న‌డిపించే విధానంలో మాత్రం రోటీన్ హార‌ర్ దారిని ఎంచుకున్నాడు. ఎన్నో సినిమాల్లో ఉప‌యోగించిన సౌండ్‌, కెమెరా టెక్నిక్స్‌ను న‌మ్ముకోవ‌డంతో హార‌ర్ ఎఫెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు.

కానీ నాలుగు క‌థ‌ల్లోని అమ్మాయిల‌కు ఆకాష్ జీవితాన్ని ముడిపెట్టే మ‌లుపుల‌తో పాటు కైరా స్నేహిత‌ల గురించి ఎండింగ్‌లో ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్విస్ట్ స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. అలాంటి సీన్స్ మ‌రొకొన్ని రాసుకుంటే బాగుండేది.

అంద‌రూ హీరోయిన్లే..

ఈ సినిమాలో ఎక్కువ‌గా హీరోయిన్ క్యారెక్ట‌ర్సే క‌నిపిస్తాయి. కైరా పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌ట‌న ఓకే అనిపిస్తుంది. ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎమోష‌న్స్ విష‌యంలో మ‌రికొంత జాగ్ర‌త్త తీసుకుంటే బాగుండేది. నివేథా పేతురాజ్‌, మేఘా ఆకాష్‌, మంజిమామోహ‌న్ క‌నిపించేది పాత్ర‌ల నిడివి త‌క్కువే అయినా త‌మ న‌ట‌న‌తో ప‌ర్వాలేద‌నిపించారు. ఆకాష్ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ ఎమోష‌న‌ల్ రోల్‌లో క‌నిపించాడు.

Boo Movie Review -భ‌య‌పెట్ట‌డంలో

బూ మూవీ స్టోరీ ఐడియా , హ‌లోవీన్ సెట‌ప్‌లోనే బాగానే ఓల్డ్ హార‌ర్ స్కూల్ ఫార్ములాను ఫాలో అవుతూ సినిమాను న‌డిపించ‌డంతో భ‌య‌పెట్ట‌లేక చ‌తికిలా ప‌డింది.అంద‌రూ పేరున్న న‌టీన‌టులు కావ‌డంతో వారికోస‌మైనా ఓ సారి చూడొచ్చు.

రేటింగ్‌: 2.5/5

IPL_Entry_Point