Guppedantha Manasu May 19 Episode: శైలేంద్ర‌కు షాకిచ్చిన రిషి - రొమాంటిక్ మూడ్‌లో రిషిధార‌-guppedantha manasu may 19th episode rishi shocked to shailendra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 19th Episode Rishi Shocked To Shailendra

Guppedantha Manasu May 19 Episode: శైలేంద్ర‌కు షాకిచ్చిన రిషి - రొమాంటిక్ మూడ్‌లో రిషిధార‌

HT Telugu Desk HT Telugu
May 19, 2023 08:18 AM IST

Guppedantha Manasu May 19 Episode: డీబీఎస్‌టీ కాలేజీని సొంతం చేసుకోవ‌డానికి కొత్త ప్లాన్ వేస్తాడు శైలేంద్ర‌. కానీ అత‌డి ప్లాన్‌కు రిషి అంగీక‌రించ‌దు. వ‌సుధారపై కూడా సీరియ‌స్ అవుతాడు.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 19 Episode: రిషికి శైలేంద్ర ఆప‌ద త‌ల‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని జ‌గ‌తి చెప్పిన మాట‌ల‌ను గురించి ఆలోచిస్తూ ఒంట‌రిగా లాన్‌లో కూర్చుంటుంది వ‌సుధార‌. ఆమెలోని ఒంట‌రిత‌నాన్ని పోగోట్ట‌డానికి రిషి అక్క‌డ‌కు వ‌స్తాడు. మ‌న గురించి అంతా తెలిసిన జ‌గ‌తి అలా మాట్లాడ‌టం భ‌రించ‌లేక‌పోయాన‌ని రిషి వ‌సుధార‌తో అంటాడు. మ‌న‌కు ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని భ‌యం...అందుకే జ‌గ‌తి మేడ‌మ్ అలా మ‌ట్లాడింద‌ని రిషికి స‌ర్ధిచెబుతుంది వ‌సుధార‌. అమ్మ ప్రేమ అంతే అని అంటుంది. వ‌సుధార మాట‌ల‌కు మ‌న‌కు ప్ర‌మాదం త‌ల‌పెట్టేవాళ్లు ఎవ‌రున్నారు చెప్పు అని రిషి స‌మాధాన‌మిస్తాడు

గుడ్‌నైట్ చెప్ప‌ని వ‌సు...

నేను క‌ఠువుగా మాట్లాడాన‌ని మేడ‌మ్ బాధ‌ప‌డిందా అని వ‌సుధార‌ను అడుగుతాడు. మేడ‌మ్ మీద కోప్పాడాలంటే నాకు మ‌న‌సు రావ‌డం లేదు. కానీ తాను చేసే ప‌నులు, మాట్లాడే మాట‌లు కోపాన్ని తెప్పిస్తున్నాయ‌ని రిషి చెబుతాడు. మేడ‌మ్‌లో బాధ‌ప‌డ‌లేద‌ని, ఆమెకు మీ క్షేమ‌మే ముఖ్య‌మ‌ని వ‌సుధార చెప్పిన మాట‌ల‌కు రిషి ఎమోష‌న‌ల్ అవుతాడు.

అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డానికి రెడీ అవుతాడు. వ‌సుధార‌కు గుడ్‌నైట్ చెబుతాడు. కానీ ఆమె మాత్రం రిషికి తిరిగి గుడ్‌నైట్ చెప్ప‌దు. అందుకు కార‌ణం అడుగుతాడు రిషి. మిమ్మ‌ల్ని మూమాలు మ‌నిషిని చేసిన త‌ర్వాత హ్యాపీగా గుడ్‌నైట్ చెప్పిన‌ప్పుడే నాకు హ్యాపీ నైట్ అని వ‌సుధార అంటుంది. ఇందుకోసం క్విజ్ ఆడుదామ‌ని అంటుంది.

లాన్‌లోనే నిద్ర‌పోయిన వ‌సు, రిషి

త‌మ లైఫ్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల గురించే క్విజ్ ఆడుతారు. పాత జ్ఞాప‌కాలు అన్ని గుర్తుచేసుకొని హ్యాపీ మూడ్‌లోకి వెళ‌తారు. క్విజ్ అయిపోయేలోపు ఒక‌రిపై మ‌రొక‌రు వాలిపోయి లాన్‌లోనే నిద్ర‌పోతారు. ఉద‌యం ధ‌ర‌ణి వ‌చ్చి వారిని నిద్ర‌లేపుతుంది. రాత్రంతా నిద్ర‌పోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారా అంటూ అడుగుతుంది. అవున‌ని బ‌దులిస్తారు ఇద్ద‌రు. వారిద్ద‌రి అనుబంధం, ప్రేమ చూసి ధ‌ర‌ణి ఆనంద‌ప‌డుతుంది.

రొమాంటిక్ మూడ్‌...

ఆ త‌ర్వాత కాలేజీకి వెళ్ల‌డానికి వ‌సుధార రెడీ అవుతోంది. ఆమె గ‌దిలోకి రావ‌డానికి రిషి ప‌ర్మిష‌న్ అడుగుతాడు. ప్ర‌తిసారి నా గ‌దిలోకి రావ‌డానికి ప‌ర్మిష‌న్ ఎందుకు అడుగుతారు అని వ‌సుధార అత‌డితో అంటుంది. అమ్మాయిలకు ఇచ్చే రెస్పాక్ట్ ఇవ్వాల‌ని, మీ గ‌దిలోకి రావాలంటే ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందేన‌ని బ‌దులిస్తాడు రిషి. అత‌డి లాజిక్‌ల‌కు వ‌సుధార ఆశ్చ‌ర్య‌పోతుంది. ఆ త‌ర్వాత మ‌రోసారి ఇద్ద‌రు రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు.

వ‌సుధారకు చెమ‌ట ప‌ట్ట‌డంతో ట‌వ‌ల్‌తో రిషి తుడుస్తుంటాడు. వ‌సుధార వ‌ద్ద‌ని వారిస్తుంది. ఆ ప‌ని చేయ‌డం క్రైమా అని రిషి అడుగుతాడు. మీలాంటి జెంటిల్‌మెన్ ఇలాంటి ప‌నులు చేయ‌డం నేర‌మే అని వ‌సుధార అంటుంది. అందుకు రిషి కూడా ఇంత అందంగా ఉండ‌టం కూడా క్రైమ్ అంటూ వ‌సుధార‌ను ఆట‌ప‌ట్టిస్తాడు. మ‌న ఇద్ద‌రికి ఎంగేజ్‌మెంట్ అయ్యింద క‌దా...అంటే స‌గం పెళ్లి అయిన‌ట్లే క‌దా అని రిషి అంటాడు. పూర్తిగా కానీవ్వండి అంటుంది వ‌సుధార‌.

దాంతో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ‌ని వ‌సుధార‌ను అడుగుతాడు. రిషి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించే అని వ‌సుధార అత‌డితో అంటుంది. ఆ త‌ర్వాత వ‌సుధార రెడీ అవుతానంటే ఏదైనా స‌హాయం చేయ‌లా అని రిషి ఆమెను అడుగుతాడు. వారి అన్యోన్య‌త‌ను అనుకోకుండా చూసిన జ‌గ‌తి సంతోష‌ప‌డుతుంది.

శైలేంద్ర కొత్త ప్లాన్‌...

మిష‌న్ ఎడ్యుకేష‌న్‌ను స‌క్సెస్ చేసిన రిషిపై శైలేంద్ర ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. అత‌డి మాట‌లు చూసి జ‌గ‌తి షాక్ అవుతుంది. ఆ త‌ర్వాత మిష‌న్ ఎడ్యుకేష‌న్‌ను మిగిలిన స్టేట్స్‌లో విస్త‌రిస్తే బాగుంటుంద‌ని అంటాడు. ఆ ప‌నులు నువ్వు, వ‌సుధార చూసుకుంటే బాగుంటుంది. వాటికోసం వేరే స్టేట్స్‌కు మీరు వెళ్ళాలని కాలేజీని సొంతం చేసుకోవ‌డానికి తాను వేసిన‌ అస‌లు ప్లాన్‌ను బ‌య‌ట‌ప‌డెతాడు. కానీ రిషి మాత్రం కాలేజీని వ‌దిలిపెట్టి వెళ్ల‌డానికి ఒప్పుకోడు. శైలేంద్ర ప్ర‌తిపాద‌న‌ను తిరస్కరిస్తాడు.

కాలేజీని నా ప్రాణంలా చూసుకుంటాన‌నిశైలేంద్ర… రిషికి హామీ ఇస్తాడు. నువ్వు చెప్పిన‌ట్లుగానే తాము న‌డుచుకుంటామ‌ని రిషిని క‌న్వీన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ఇంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన ఫ‌ణీంద్ర...రిషి కాలేజీని వ‌దిలిపెట్ట‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని అంటాడు. తండ్రి మాట‌ల‌కు శైలేంద్ర కూడా షాక్ అవుతాడు.

వ‌సుధార‌పై సీరియ‌స్‌...

వ‌సుధార కూడా మ‌నం ఇక్క‌డి నుంచి వెళ్లిపోదామ‌ని రిషికి స‌ల‌హా ఇస్తుంది. ఆమెపై కూడా రిషి సీరియ‌స్ అవుతాడు. తాను కాలేజీని వ‌దిలిపెట్టే వెళ్లే ప్ర‌స్త‌కి లేద‌ని అంటాడు. శ‌త్రువుల‌కు ఎలా బుద్ది చెప్పాలో త‌న‌కు తెలుసు అంటూ రిషి చెప్ప‌డంతో శైలేంద్ర ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point