తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Panchayat 3 Ott Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

02 May 2024, 17:11 IST

  • Panchayat 3 OTT Release Date: ప్రైమ్ వీడియో సస్పెన్స్ కు తెర దించింది. పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ను గురువారం (మే 2) తమ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్ వీడింది. మొత్తానికి ఊరించి.. ఊరించి.. పంచాయత్ సీజన్ 3 (Panchayat 3) ఓటీటీ రిలీజ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (మే 2) అనౌన్స్ చేసింది. చాలా రోజులుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఊహించినట్లే ఈ నెలలోనే ఈ కొత్త సీజన్ వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

Malayalam Movie: గుక్క‌తిప్పుకోకుండా ఒకేసారి ఈ మ‌ల‌యాళం మూవీ టైటిల్ చెప్ప‌గ‌ల‌రా? - ఓ సారి ట్రై చేయండి?

పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్

పంచాయత్ సీజన్ 3 మే 28 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. చాలా రోజులు ఊరించి.. ఫ్యాన్స్ కు సొరకాయలు తొలగించే ఓ పెద్ద పని చెప్పి.. మెల్లగా ఈ కొత్త సీజన్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మే నెలలోనే వస్తుందని బుధవారమే ప్రైమ్ వీడియో రివీల్ చేసినా.. తేదీని మాత్రం ఇవాళ (మే 2) వెల్లడించింది.

నీనా గుప్తా, జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్ నటించిన పంచాయత్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. రెండో సీజన్ వచ్చి కూడా రెండేళ్లవుతోంది. మూడో సీజన్ వచ్చేస్తోందని గతేడాది నుంచే ప్రైమ్ వీడియో ఊరించింది. మొత్తానికి ఈ కొత్త సీజన్ ను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

పంచాయత్ సీజన్ 3

పంచాయత్ సీజన్ 3కి ఉన్న క్రేజ్ ను ప్రైమ్ వీడియో బాగానే వాడుకుంది. ఈ కొత్త సీజన్ రిలీజ్ డేట్ ను టీజ్ చేస్తూ వస్తోంది. కొన్నాళ్లు త్వరలోనూ అంటూ ఊరించి.. తర్వాత ఇదే ఏడాది అని చెప్పి.. ఆ తర్వాత మే నెలలోనే అని రివీల్ చేసి.. చివరికి అభిమానులతో ఆ తేదీకి అడ్డుగా ఉన్న సొరకాలన్నింటినీ తొలగింపజేసి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

మూడు రోజుల పాటు ఈ స్ట్రీమింగ్ డేట్ పై ఉన్న సొరకాయలను తొలగించే ప్రక్రియ సాగడం విశేషం. ఒక దశలో అభిమానులు ప్రైమ్ వీడియో తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చివరికి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ డేట్ ను చెప్పేసింది. "మీరు సొరకాయలను తొలగించారు. మేము రివార్డులను ప్రకటించాం" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది.

ఏంటీ పంచాయత్ వెబ్ సిరీస్?

2020లో పంచాయత్ తొలి సీజన్ ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైంది. అయితే ఆ వెంటనే ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అసలు వెబ్‌సిరీస్‌ అంటే పెద్ద పెద్ద యాక్షన్‌ సినిమాలను మించిన క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌లే అనుకున్న ప్రేక్షకులకు పల్లెటూరి స్వచ్ఛమైన గాలిని అందించింది ఈ పంచాయత్‌. ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా అనే ఊరు. ఓ ఊళ్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పంచాయతీ సెక్రటరీ.

ఆ గ్రామ ప్రధాన్‌ (సర్పంచ్‌), ఉప ప్రధాన్‌ (ఉప సర్పంచ్‌), ఆ గ్రామ సహాయకుడు, ప్రతిదానికీ అడ్డుపుల్ల వేసే ఊళ్లోని ఓ క్యారెక్టర్‌, ఆ ఊరి సమస్యలు, మూఢ నమ్మకాలు.. ఇలా భారతదేశంలోని ప్రతి పల్లె, ప్రతి మనిషి ఇదేదో మా కథలాగే ఉందే అని అనిపించేలా ఆ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది.

ప్రేక్షకులను నవ్వించడానికి వెకిలి కామెడీని నమ్ముకోలేదు. అలాగని ప్రత్యేకంగా కామెడీ సీన్లను అతికించినట్లుగా కూడా ఉండదు. అలా కథతోపాటు సిచువేషనల్‌గా కామెడీ వస్తూ మనల్ని నవ్విస్తుంటుంది. అటు ఎమోషనల్‌ సీన్లలో పెద్దగా మెలోడ్రామా ఏమీ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఇక చివర్లో కాస్త దేశభక్తిని కూడా జోడించి రెండో సీజన్‌కు అదిరిపోయే క్లైమాక్స్‌ ఇచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం