Family Star OTT Streaming: ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఫ్యామిలీ స్టార్.. అయినా తప్పని ట్రోలింగ్-vijay deverakondas family star tops the list of trending movies in india still movie gets trolled by some fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Ott Streaming: ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఫ్యామిలీ స్టార్.. అయినా తప్పని ట్రోలింగ్

Family Star OTT Streaming: ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఫ్యామిలీ స్టార్.. అయినా తప్పని ట్రోలింగ్

Hari Prasad S HT Telugu
Apr 26, 2024 07:49 PM IST

Family Star OTT Streaming: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. వచ్చీ రాగానే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచినా.. కొందరు ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఫ్యామిలీ స్టార్.. అయినా తప్పని ట్రోలింగ్
ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఫ్యామిలీ స్టార్.. అయినా తప్పని ట్రోలింగ్

Family Star OTT Streaming: భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ వచ్చీ రాగానే టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానంలో నిలిచినా.. కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

yearly horoscope entry point

టాప్ ట్రెండింగ్ మూవీ ఫ్యామిలీ స్టార్

ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైంది. అయితే తొలి షో నుంచి వచ్చిన మిక్స్‌డ్ టాక్ కారణంగా సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియో ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో డిజాస్టర్ అయినా.. ఓటీటీలోకి అడుగు పెట్టగానే ప్రైమ్ వీడియో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో నంబర్ వన్ కు దూసుకెళ్లింది.

అప్పటి వరకూ టాప్ లో ఉన్న బాలీవుడ్ మూవీ తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా రెండో స్థానానికి పడిపోయింది. ఫ్యామిలీ స్టార్ ఊహించినదాని కంటే వారం ముందుగానే ఓటీటీలోకి వచ్చేయడంతో తొలి రోజు నుంచే ప్రేక్షకులు ఎగబడి చూసేశారు. దీంతో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానంలోకి వచ్చింది. థియేటర్లలో ఈ మూవీని చూడని వాళ్లు ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్‌కు తప్పని ట్రోలింగ్స్

అయితే అక్కడ ఎదురైన ట్రోలింగ్సే ఓటీటీలో రిలీజైన తర్వాత కూడా ఫ్యామిలీ స్టార్ మూవీ ఎదుర్కొంటోంది. కొందరు ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్ల గురించి చెబుతూ.. మరీ సిల్లీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రవిబాబుకు విజయ్ ఇచ్చే వార్నింగ్ పై ఈ ట్రోలింగ్ నడుస్తోంది.

విలన్ కు విలన్ భాషలోనే మరీ బూతు అర్థం వచ్చేలా విజయ్ చెప్పే డైలాగులు ఫ్యామిలీ ఆడియెన్స్ కు అస్సలు నచ్చలేదు. ఇలాంటి సినిమాను ఫ్యామిలీతో చూడాలా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఈ మూవీని ఎందుకు చూడకూడదో చెబుతూ ఈ సీన్ ను పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా తొలి రోజు థియేటర్లలో రిలీజైనప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు ఓటీటీలోనూ అలాగే వస్తోంది. కొందరు మాత్రం మరీ అంత చెత్తగా ఏమీ లేదని, యావరేజ్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ, మృణాల్ లుక్స్ మాత్రం బాగున్నాయని వాళ్లు ప్రశంసిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. మొత్తంగా కనీసం రూ.15 కోట్ల షేర్ కూడా రాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ తొలి రోజు మంచి రెస్పాన్స్ వస్తున్నా.. తర్వాత ఎలా ఉంటుందన్నది చూడాలి. ముఖ్యంగా ఈ ట్రోల్స్ మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner