Family Star OTT Release Date: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్.. మరో రెండు రోజుల్లోనే వచ్చేస్తోంది-family star ott release date prime video announced the streaming date of vijay deverakonda mrunal thakur movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Ott Release Date: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్.. మరో రెండు రోజుల్లోనే వచ్చేస్తోంది

Family Star OTT Release Date: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్.. మరో రెండు రోజుల్లోనే వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu
Apr 24, 2024 01:21 PM IST

Family Star OTT Release Date: విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్ చేసింది. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రానుంది.

ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్.. మరో రెండు రోజుల్లోనే వచ్చేస్తోంది
ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్.. మరో రెండు రోజుల్లోనే వచ్చేస్తోంది

Family Star OTT Release Date: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా అనుకున్నదాని కంటే వారం ముందుగానే రానుంది. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం.

yearly horoscope entry point

ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్

విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో మూడు వారాల్లోనే ఓటీటీలో అడుగు పెడుతోంది. ఈ సినిమా హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కనీసం నెల రోజులు కూడా వేచి చూడకుండానే ఏప్రిల్ 26న నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

పరశురాం డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ నిర్మాత దిల్ రాజుకు తీవ్ర నష్టాలను తీసుకొచ్చింది. తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.15 కోట్ల షేర్ కూడా సాధించలేకపోయింది. దీంతో విజయ్ తన రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సరిగ్గా మూడు వారాల తర్వాత అంటే ఏప్రిల్ 26న ఓటీటీలోకి రానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. థియేటర్లలో ఫెయిలైన ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఎంత మేరకు ఆదరిస్తారన్నది చూడాలి. గతంలో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు.. ఓటీటీలో మాత్రం సక్సెసైన సందర్భాలు ఉన్నాయి.

ఫ్యామిలీ స్టార్ ఎందుకు బోల్తా పడిందంటే?

కుటుంబ బాధ్య‌త‌ల్ని నెర‌వేర్చే క్ర‌మంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొన్నాడు. త‌న ఫ్యామిలీని ఉన్న‌తంగా చూడాల‌నే క‌ల‌లు క‌నే అత‌డి జీవితంలోకి ఓ అమ్మాయి వ‌చ్చి ఎలాంటి అల‌జ‌డి రేపింద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ క‌థ‌ను రాసుకున్నాడు. ఈ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీ, రొమాన్స్‌ను అల్లుకుంటూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని అనుకున్నారు.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, రొమాన్స్‌ను రియ‌లిస్టిక్‌గా చూపించ‌డం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ బ‌లం. ఆ బ‌ల‌మే ఈ సినిమాలో బ‌ల‌హీన‌త‌గా మారింది. మిడిల్ క్లాస్ క‌ష్టాల‌న్నీ చాలా ఆర్టిఫిషియ‌ల్‌గా సాగుతాయి. కుటుంబం కోసం హీరో చేసే త్యాగాలు టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తాయి. క‌థ‌, క‌థ‌నాలు మొత్తం 1990 కాలం నాటి సినిమాల‌ను గుర్తుకు తెస్తాయి.

కామెడీ పేరుతో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ రాసుకున్న సీన్స్ బెడిసికొట్టాయి. విజ‌య్‌ని అమెరికాలో అమ్మాయిలు కిడ్నాప్ చేయడానికి ప్ర‌య‌త్నించ‌డం, లుంగీ సీన్స్ చిరాకును తెప్పిస్తాయి. పాట‌లు, ఫైట్స్ ప్లేస్‌మెంట్ స‌రిగ్గా కుద‌ర‌లేదు.

సెకండాఫ్ మొత్తం సాగ‌తీత‌గా అనిపిస్తుంది. బ‌ల‌వంతంగా వ‌చ్చే రొమాంటిక్ సీన్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో క‌థ ఎంత‌కుముందు క‌ద‌ల‌క అక్క‌డే తిరుగుతుంది.

Whats_app_banner