Aavesham OTT: ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? - స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?-aavesham ott release date when and where to watch fahadh faasil malayalam gangster action movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Ott: ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? - స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

Aavesham OTT: ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? - స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 24, 2024 09:20 AM IST

Aavesham OTT: ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ ఆవేశం ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చింది. ఈ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఆవేశం ఓటీటీ
ఆవేశం ఓటీటీ

Aavesham OTT: ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ఆవేశం మూవీ థియేట‌ర్ల‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫ‌హాద్ ఫాజిల్ కెరీర్‌లో ఈ మైలురాయిని చేరుకున్న ఫ‌స్ట్ మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది. ఈ ఏడాది మంజుమ్మేల్ బాయ్స్‌, ప్రేమ‌లు, ది గోట్‌లైఫ్‌ త‌ర్వాత మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో మూవీగా ఆవేశం రికార్డ్ క్రియేట్ చేసింది. . గ్యాంగ్‌స్ట‌ర్ కామెడీ డ్రామా క‌థాంశంతో రొమాంచం ఫేమ్ జీతూ మాధ‌వ‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. కథ‌, డైరెక్ట‌ర్ టేకింగ్‌తో పాటు రంగా అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ఫ‌హాద్ ఫాజిల్ బాడీలాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

అనుకున్న‌దానికంటే ముందుగానే...

థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోన్న ఈ మూవీ అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆవేశం మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. ఈ మూవీ మే 17న ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. మే సెకండ్ వీక్‌లోనే ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలుస్తోంది.

గ్యాంగ్‌స్ట‌ర్ రంగా...

గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌కు మ‌ద‌ర్‌సెంటిమెంట్‌, కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు జీతూ మాధ‌వ‌న్ ఆవేశం మూవీ క‌థ‌ను రాసుకున్నాడు. శాంత‌న్ (రోష‌న్ శాన్‌వాజ్‌), బీబీ (మిథున్ జై శంక‌ర్‌), అజు(హిప్‌స్ట‌ర్‌) ఇంజ‌నీరింగ్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరు వ‌స్తారుఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో సీనియ‌ర్లు వేధిస్తారు.

లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ రంగా రావు అలియాస్‌ రంగా (ఫ‌హాద్ ఫాజిల్‌) స‌హాయంతో సీనియ‌ర్ల‌పై అజు, బీబీ, శాంత‌న్ ప‌గ‌ను తీర్చుకుంటారు. రంగా గ్యాంగ్‌లో చేరిన ఆ ముగ్గురు త‌మ చ‌దువుకు ఎలా దూర‌మ‌య్యారు? రంగానే చంపాల‌ని వారు ఎందుకు అనుకున్నారు? అస‌లు రంగా ఎవ‌రు? క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ అయిన రంగా ఎవ‌రిపై చేయి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

20 కోట్ల బ‌డ్జెట్‌...

ఈ సినిమాలో సాజిన్ గోపు, రోష‌న్‌శాన్‌వాజ్‌, మిథున్ జైశంక‌ర్‌, మ‌న్సూర్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆవేశం మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమానే తానే స్వ‌యంగా ప్రొడ్యూస్ చేశాడు ఫ‌హాద్ ఫాజిల్‌. 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టింది. మ‌ల‌యాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిన్న సినిమా ప్రేమ‌లు మూవీని కూడా ఫ‌హాద్ ఫాజిల్ త‌న స్నేహితుల‌తో క‌లిపి ప్రొడ్యూస్ చేశాడు.

పుష్ప 2లో విల‌న్‌...

ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న పుష్ప 2లో విల‌న్‌గా న‌టిస్తున్నాడు ఫ‌హాద్ ఫాజిల్‌. భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ అనే నెగెటివ్ రోల్‌లో అత‌డు క‌నిపించ‌బోతున్నాడు. సెకండ్ పార్ట్‌లో ఫ‌హాద్ ఫాజిల్ విల‌నిజం ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పుష్ప 2 మూవీ ఆగ‌స్ట్ 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది నేష‌న‌ల్ వైడ్‌గా భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

IPL_Entry_Point