Malayalam Remake: తెలుగులోకి రీమేక్ అవుతోన్న మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ జయజయజయ జయహే - హీరో ఎవరంటే?
Malayalam Remake: మలయాళంలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన జయ జయ జయ జయహే మూవీ తెలుగులోకి రీమేక్ అవుతోన్నట్లు సమాచారం. ఈ రీమేక్‌లో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Jaya Jaya Jaya Jaya Hey Remake: మలయాళంలో చిన్న సినిమా రిలీజై పెద్ద విజయాన్ని సాధించిన జయజయజయజయహే మూవీ తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఈ మలయాళం రీమేక్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళ ఒరిజినల్ మూవీలో హీరోయిన్‌గా నటించిన దర్శన రాజేంద్రన్ ఈ రీమేక్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జయజయజయ జయహే రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు సమాచారం.
2022లో రిలీజ్...
జయ జయ జయ జయహే మూవీ 2022లో మలయాళం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాసిల్ జోసెఫ్, దర్శనరాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది.
45 కోట్ల కలెక్షన్స్…
ముఖ్యంగా ఈ మూవీలో జయ పాత్రలో దర్శనరాజేంద్రన్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని మెప్పించింది. భర్త పెట్టే చిత్రహింసలను భరించలేక అతడిపై ఎదురుతిరగే భార్య పాత్రలో దర్శన రాజేంద్రన్ నటనకు ప్రశంసలు దక్కాయి. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు పదింతల లాభాలను మిగిల్చింది.
జయ జయ జయ జయహే కథ ఇదే...
జయ (దర్శన రాజేంద్రన్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. జయకు ఇష్టం లేకపోయినా రాజేష్ (బాసిల్ జోసెఫ్) అనే వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తారు పెద్దలు. రాజేష్‌కు కోపం ఎక్కువ. ప్రతి విషయంలో జయపై చేయిచేసుకుంటాడు.
భర్త హింసు చాలా రోజులు భరించిన జయ ఓ రోజు తనపై చేయిచేసుకోవడానికి వచ్చిన రాజేష్‌ను తిరిగి కొడుతుంది జయ. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని జయపై తనపై దాడి చేసిందని రాజేష్ గ్రహిస్తాడు. తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అతడి ప్లాన్ ఫెయిలవుతుంది.
ఆ తర్వాత రాజేష్ ఏం చేశాడు. భార్యపై రివేంజ్ తీసుకోవడానికి అతడు వేసిన మరో ప్లాన్ ఏమిటి? జయపై కోపంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన రాజేష్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? భర్త హింస నుంచి దూరకావడానికి జయ ఏ విధమైన నిర్ణయం తీసుకుంది అన్నదే ఈ మూవీ కథ.
కీడా కోలాతో...
లాంగ్ గ్యాప్ తర్వాత కీడాకోలా మూవీకి దర్శకత్వం వహించాడు తరుణ్ భాస్కర్. క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అతడే ఓ కీలక పాత్ర పోషించాడు. కమర్షియల్‌గా ఈ మూవీ పర్వాలేదనిపించింది. కీడాకోలా మూవీలో చైతన్యరావు, బ్రహ్మానందం, రాగ్‌మయూర్ కీలక పాత్రలు పోషించారు.
దూతలో విలన్…
ప్రస్తుతం చిన్న సినిమాలతో వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీగా ఉన్నాడు. నాగచైతన్య దూత వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్ రోల్ చేశాడు. మంగళవారం, దాస్ కీ ధమ్కీతో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు తరుణ్ భాస్కర్.