Heeramandi Web Series: ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి.. ఆ హీరోయిన్‌కే అత్యధిక రెమ్యునరేషన్-indias most expensive web series heeramandi remunerations sonakshi sinha gets highest heeramandi streaming date netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heeramandi Web Series: ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి.. ఆ హీరోయిన్‌కే అత్యధిక రెమ్యునరేషన్

Heeramandi Web Series: ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి.. ఆ హీరోయిన్‌కే అత్యధిక రెమ్యునరేషన్

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 09:24 AM IST

Heeramandi Web Series: ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా నిలవబోతోంది హీరామండి. మరి ఈ సిరీస్ లో నటించిన వారి రెమ్యునరేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.

ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి.. ఆ హీరోయిన్‌కే అత్యధిక రెమ్యునరేషన్
ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి.. ఆ హీరోయిన్‌కే అత్యధిక రెమ్యునరేషన్

Heeramandi Web Series: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి.. మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ కు చెందిన టాప్ యాక్టర్స్ నటించారు. మరి ఇంత భారీ బడ్జెట్ సిరీస్ లో నటీనటులు అందుకున్న రెమ్యునరేషన్లు ఎంతో మీకు తెలుసా?

హీరామండి రెమ్యునరేషన్లు

సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే ఓ విజువల్ ఫీస్ట్. అలా చూపించడానికి అతడు భారీగానే ఖర్చు పెట్టిస్తాడు. అలాంటి డైరెక్టర్ తొలిసారి ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడంటే దానికి బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఇందులో సోనాక్షి సిన్హా, రిచా చద్దా, మనీషా కొయిరాలా, సంజీదా షేక్, అదితి రావ్ హైదరిలాంటి బాలీవుడ్ నటీమణులు నటిస్తున్నారు.

దీంతో వాళ్లకు రెమ్యునరేషన్ల రూపంలోనే పెద్ద మొత్తం పోతుంది. అందులోనూ డైరెక్టర్ గా భన్సాలీయే అత్యధికంగా రూ.60 నుంచి రూ.65 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక నటీమణుల విషయానికి వస్తే.. వీళ్లలో అత్యధిక మొత్తం అందుకున్న నటి సోనాక్షి సిన్హానే. ఆమె ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి రూ.2 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె ఫరీదా అనే పాత్రలో కనిపించనుంది. కళంక్ మూవీ తర్వాత సోనాక్షి నటించిన పీరియడ్ డ్రామా ఇది.

ఇక అదితి రావ్ హైదరి ఈ హీరామండిలో బిబ్బోజాన్ పాత్రలో నటించింది. దీనికోసం ఆమె రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు చెబుతున్నారు. గతేడాదే ఆమె జీ5 ఓటీటీలో వచ్చిన తాజ్ అనే మరో పీరియడ్ డ్రామాలోనూ నటించిన విషయం తెలిసిందే. ఒకప్పటి అందాల తార మనీషా కొయిరాలా ఈ సిరీస్ లో మాలికాజాన్ పాత్రలో నటించింది.

ఈ పాత్ర కోసం ఆమె రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకుంది. అటు మరో బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా లజ్జో పాత్ర కోసం రూ.కోటి తీసుకోవడం విశేషం. ఇక చాలా రోజుల తర్వాత తిరిగి కెమెరా ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఈ సిరీస్ లో వలి మహ్మద్ పాత్ర పోషించాడు. దీనికోసం అతడు రూ.75 లక్షలు వసూలు చేశాడు. సంజీదా షేక్ రూ.40 లక్షలు, షర్మిన్ సెహగల్ రూ.35 లక్షలు అందుకున్నారు.

హీరామండి స్ట్రీమింగ్ డేట్

హీరామండి వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే ఈ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు.

అప్పట్లో వాళ్లు ఎంత విలాసవంతంగా బతికారో చూపించడంతోపాటు స్వాతంత్య్రోద్యమంలో వాళ్లు పోషించిన పాత్రను కూడా ఈ హీరామండి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

Whats_app_banner