Netflix Top Korean web series: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్ కొరియన్ సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ వెబ్ సిరీస్ ఇవే
Netflix Top Korean web series: కొరియన్ డ్రామాస్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ కొరియన్ వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి. ఇప్పటి వరకూ మీరు చూడకపోయి ఉంటే.. ఏదో ఒక వీకెండ్ లో ప్లాన్ చేయండి.
Netflix Top Korean web series: కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ అంటే ఆసక్తి ఉందా? అయితే అందులో ఏం చూడాలో తేల్చుకోలేకపోతున్నారా? ఒకవేళ మీకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే కనుక వెంటనే ఇప్పుడు చెప్పబోయే టాప్ వెబ్ సిరీస్ చూసేయండి. వీటిలో హారర్, కామెడీ, డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్ లాంటి ఎన్నో జానర్ల వెబ్ సిరీస్ ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ కొరియన్ వెబ్ సిరీస్
ఇండియాలో మలయాళం భాషకు చెందిన సినిమాలు, సిరీస్ కు ఎలాగైతే ఆదరణ పెరుగుతోందో ప్రపంచవ్యాప్తంగా కొరియన్ మూవీస్, సిరీస్ కూడా అలాగే ఆకర్షిస్తున్నాయి. వాళ్ల కథలు, వాటిని చెప్పే విధానం ఇక్కడి వాళ్లకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ లోని టాప్ కొరియన్ వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూసేయండి.
స్క్విడ్ గేమ్ - సీజన్ 1
ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఇప్పటికే చాలా మంది ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులకు తెలుసు. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్.. ఇప్పటి వరకూ ఇక్కడి వాళ్లు చూడని ఓ సరికొత్త అనుభూతిని కలిగించింది. భారీ ప్రైజ్ మనీ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఓ గేమ్ షోలో పాల్గొనే కొందరు కంటెస్టెంట్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 94 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ సిరీస్ గా నిలిచిన స్క్విడ్ గేమ్.. ఈ ఏడాదే రెండో సీజన్ తో రాబోతోంది.
మై నేమ్ - సీజన్ 1
ఇది కూడా ఓ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ వెబ్ సిరీసే. గ్యాంగ్‌స్టర్ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఓ యువతి చుట్టూ తిరిగే కథే ఈ మై నేమ్. 2021లో తొలి సీజన్ వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్లు ఈ సిరీస్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.
సిగ్నల్ - సీజన్ 1
సిగ్నల్ 2016లోనే వచ్చిన కొరియన్ క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ వెబ్ సిరీస్. ఇదొక డిఫరెంట్ క్రైమ్ స్టోరీ. ఓ క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి 2015లో ఓ వాకీ టాకీ దొరుకుతుంది. దానితో అతడు గతంలో ఉన్న వాళ్లతోనూ మాట్లాడగలడు. అలా 1989లో ఉన్న ఓ పోలీస్ డిటెక్టివ్ తో మాట్లాడి ఓ కేసు పరిష్కరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సిగ్నల్ సిరీస్ లో చూడొచ్చు.
కింగ్‌డమ్ - 2 సీజన్లు
2020లో ప్రారంభమైన కింగ్‌డమ్ వెబ్ సిరీస్ హారర్ జానర్ కు చెందినది. ఈ పీరియడ్ డ్రామా 16వ శతాబ్దంలో జరిగినట్లుగా చూపించారు. ఓ రాజు, యువరాజ్ చుట్టూ తిరుగుతుంది. వింతయిన వ్యాధి బారిన పడిన తన తండ్రికి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో అతనికి ఓ జాంబీ మహమ్మారి సోకినట్లు యువరాజు కనుగొంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ - సీజన్ 1
కొరియన్ భాషలో వచ్చిన మరో హారర్, జాంబీస్ సిరీస్ ఈ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్. ఓ హైస్కూల్లో చిక్కుకుపోయిన కొందరు టీనేజర్ల తాము జాంబీ జోన్ లో ఉన్నట్లు తెలుసుకుంటారు. హారర్ ఇష్టపడే వారు ఈ సిరీస్ బాగా ఎంజాయ్ చేస్తారు.