Mob thrashes police : ‘నేను పోలీస్ ఆఫీసర్’ అని చెప్పినా వదల్లేదు- దారుణంగా కొట్టారు.. అసలేం జరిగింది?
Mob thrashes police : యూపీలో ఓ పోలీసుపై కొందరు దాడి చేశారు. దారుణంగా చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! వారణాసి జిల్లాలో ఓ పోలీసును అల్లరిమూకలు చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
రాజతలాబ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి అజిత్ వర్మ కారు.. ఆదివారం సాయంత్రం ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. భయంతో భార్యాపిల్లలు వాహనం లోపల వేచి ఉండగా.. గుంపు పోలీసులపై పంచ్‌లు, దెబ్బల వర్షం కురిపించింది.
ఈ ఘటన మొత్తాన్ని కొందరు కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఆటోను ఢీకొన్న తర్వాత ప్రజలు కారును చుట్టుముట్టి సదరు పోలీసును వాహనం నుంచి బయటకు లాగి చితకబాదారు.
రోహనియా నుంచి వారణాసికి కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు.
తాను రాజతలాబ్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు! తాను పోలీస్ అన్న మాటలు.. కోపంతో ఉన్న గుంపు నుంచి ఆయన్ని రక్షించలేకపోయాయి. కుటుంబ సభ్యుల ముందు తనను కొట్టొద్దని ఆయన వేడుకున్నా ఫలితం దక్కలేదు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చూడండి..
వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని సదరు పోలీసును రక్షించారు.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
కానిస్టేబుల్ని పొడిచి చంపేశారు..!
దిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! మద్యం తాగి నడుపుతున్నారన్న కారణంతో ఓ కానిస్టేబుల్ ఓ వాహనాన్ని అడ్డుకున్నాడు. ఆ బండి మీద ఉన్న ముగ్గురు.. కోపంతో, కానిస్టేబుల్ని చంపేశారు!
ఆగ్నేయ దిల్లీలోని గోవింద్పూరిలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ని శనివారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారు.
మృతుడు కిరణ్‌పాల్ సింగ్ (28) గోవింద్‌పురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో దీపక్ సింగ్ అలియాస్ మ్యాక్స్ (20), క్రిష్ గుప్తా (18)లను అరెస్టు చేశామని, మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అతని మొదటి పేరు రాఘవ్ అలియాస్ రాకీ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం