Squid Game The Challenge: ‘స్క్విడ్ గేమ్’ రియాల్టీ టీవీ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. టీజర్ రిలీజ్: వివరాలివే
Squid Game Squid Game The Challenge: స్క్విడ్ గేమ్: ఛాలెంజ్ రియాల్టీ టీవీ సిరీస్ వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍తో పాటు మరిన్ని వివరాలతో టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వివరాలివే..
Squid Game The Challenge Date: ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయింది. క్షణక్షణం ఉత్కంఠ గొలిపేలా ఉండే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించింది. 2021లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చిన స్క్విడ్ గేమ్‍కు వరల్డ్ వైడ్‍గా ఆదరణ లభించింది. దీంతో వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‍గా నిలిచింది. చిన్నచిన్న గేమ్‍లతోనే ఉండే ఈ స్క్విడ్ గేమ్‍లలో ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్లు చేసే పోరాటం భావోద్వేగంగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో రేగుతుంటోంది. ఇంత పాపులర్ అయిన ‘స్క్విడ్ గేమ్’ ఆధారంగా బ్రిటీష్ టీవీ రియాల్టీ కాంపిటిషన్ సిరీస్ వస్తోంది. 'స్విడ్ గేమ్: ది చాలెంజ్’ పేరుతో వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ సహా మరిన్ని వివరాలు ఇవే.
‘స్క్విడ్ గేమ్: ది చాలెంజ్’కు సంబంధించిన టీజర్‌ను నెట్‍ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. 2023 నవంబర్ 22వ తేదీన ఈ 'స్క్విడ్ గేమ్: ది చాలెంజ్' సిరీస్ స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. అలాగే, గేమ్‍కు సంబంధించిన కొన్ని వివరాలను ప్రకటించింది. భారీగా, ఉత్కంఠతో ఈ స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ ఉండేలా ఉంది.
456 మందితో.. 4.56 మిలియన్ల క్యాష్ ప్రైజ్‍మనీతో ఈ స్క్విడ్ గేమ్: ది చాలెంజ్ రియాల్టీ గేమ్ షో ఉంటుందని టీజర్లో ఉంది. ఇది బిగ్గెస్ట్ కాంపిటీషన్ సిరీస్ అనే అనౌన్స్‌మెంట్‍తో టీజర్ మొదలైంది. రియాలిటీ షోలో అతిపెద్ద క్యాష్ ప్రైజ్ కోసం తలపడడండి అని కంటెస్టెంట్‍లకు చెబుతున్నట్టుగా వాయిస్ ఓవర్ ఉంది. 'స్క్విడ్ గేమ్' ప్రపంచం కూడా కొత్తగా ఉంది. నవంబర్ 22వ తేదీన ఈ ‘స్క్విడ్ గేమ్: ది చాలెంజ్’ మొదలవుతుందని నెట్‍ఫ్లిక్స్ పేర్కొంది.
కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు. ఈ గేమ్‍లో ఎలిమినేషన్ అంటే కంటెస్టెంట్లను చంపడమే. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అనుక్షణం కలుగించింది. ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‍లో లీ జంగ్ జయీ, వి హా జూన్ కీలకపాత్రలు పోషించనున్నారు. దీనికి రెండో సీజన్ కూడా రానుంది.