OTT Top Korean Movies: ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు-ott top korean movies parasite save the green planet memories of murder in prime video netflix and other otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top Korean Movies: ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

OTT Top Korean Movies: ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

Hari Prasad S HT Telugu
Apr 04, 2024 10:07 PM IST

OTT Top Korean Movies: మలయాళం సినిమాల్లాగే కొరియన్ మూవీస్ కూడా ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ మూవీస్ మీరు చూశారా?

ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ కొరియన్ సినిమాలు చూశారా.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

OTT Top Korean Movies: కొరియన్ డ్రామాస్ కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ సినిమాకు ఓ కొత్త నడక నేర్పుతున్న అక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వీటిలో ఆస్కార్ విన్నర్ పారాసైట్ తోపాటు పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

yearly horoscope entry point

టాప్ కొరియన్ సినిమాలు ఇవే

కొరియన్ మూవీస్ లో చాలా వరకూ ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు గత 20 ఏళ్లలోనే వచ్చాయి.

పారాసైట్ - ప్రైమ్ వీడియో

2018లో వచ్చిన పారాసైట్ మూవీ ఒక రకంగా ప్రపంచానికి కొరియన్ సినిమాల సత్తా ఏంటో పరిచయం చేసింది. ముఖ్యంగా ఇండియన్ మూవీ లవర్స్ ఈ ఆస్కార్ విన్నింగ్ సినిమా తర్వాతే కొరియన్ సినిమాలను ఫాలో అవడం మొదలుపెట్టారు. సమాజంలో ఆర్థికపరమైన అసమానతలు ఓ స్థాయిలో పెరిగిపోతున్నాయి.

అయితే ధనవంతులు, పేదల మధ్య ఉన్న గ్యాప్ ఎలాంటిదో ఈ పారాసైట్ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ పేదరికాన్ని అధిగమించడానికి ఓ కుటుంబం డబ్బున్న ఇంట్లో పనివాళ్లుగా చేరిన తర్వాత వాళ్లు ఎదుర్కొనే సవాళ్లతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది.

మెమొరీస్ ఆఫ్ మర్డర్ - నెట్‌ఫ్లిక్స్

మెమొరీస్ ఆఫ్ మర్డర్ ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 1980ల్లో కొరియాలోని ఓ చిన్న టౌన్లో జరిగిన వరుస హత్యలు, వాటి విచారణ జరిగే తీరుపై ఈ సినిమా తెరకెక్కింది. మెమొరీస్ ఆఫ్ మర్డర్ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

సేవ్ ద గ్రీన్ ప్లానెట్ - నెట్‌ఫ్లిక్స్

మన భూమిపై ఆండ్రోమెడా నుంచి వచ్చి ఏలియన్స్ ఉన్నారని, వాళ్లు మన భూమిని నాశనం చేయడానికి వచ్చారని నమ్మే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కామెడీ మూవీ ఇది. ఆ ఏలియన్స్ కు ఓ ఫార్మా కంపెనీ యజమానే లీడర్ అని నమ్మి అతన్ని కిడ్నాప్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్ - ప్రైమ్ వీడియో

ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ఓ గ్యాంగ్‌స్టర్ తో కలిసి ఓ పోలీస్ ఆఫీసర్ చేసే వింత ప్రయత్నమే ఈ ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్ మూవీ. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఓల్డ్‌బాయ్ - నెట్‌ఫ్లిక్స్

2003లో వచ్చిన ఈ ఓల్డ్ బాయ్ మూవీ కొరియన్ సినిమా దశ దిశనే మార్చేసినట్లు చెబుతారు. ఓ వ్యాపారవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి 15 ఏళ్ల పాటు చిత్రహింసలు పెడతారు. తర్వాత వదిలేస్తారు. అయితే అసలు తనను ఎవరు బంధించారో తెలుసుకొని, వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వ్యక్తి చూస్తాడు. కానీ దీనికోసం అతని దగ్గర 5 రోజుల సమయమే ఉంటుంది. తర్వాత అతడు ఏం చేస్తాడన్నది ఈ మూవీలో చూడొచ్చు.

Whats_app_banner