Fighter in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ రికార్డు బ్రేక్ చేసిన ఫైటర్.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్-fighter in netflix breaks animal dunki records first bollywood movie to get record breaking views hrithik roshan deepika ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fighter In Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ రికార్డు బ్రేక్ చేసిన ఫైటర్.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్

Fighter in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ రికార్డు బ్రేక్ చేసిన ఫైటర్.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్

Hari Prasad S HT Telugu
Apr 04, 2024 05:56 PM IST

Fighter in Netflix: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో యానిమల్, డంకీ సినిమాల రికార్డులను లేటెస్ట్ మూవీ ఫైటర్ బ్రేక్ చేసింది. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఈ సినిమా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ రికార్డు బ్రేక్ చేసిన ఫైటర్.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్
నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ రికార్డు బ్రేక్ చేసిన ఫైటర్.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్

Fighter in Netflix: ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైన మూవీ ఫైటర్. ప్రపంచవ్యాప్తంగా ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం అసలు తిరుగే లేకుండా దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్ లో యానిమల్ లాంటి మూవీ రికార్డులను కూడా ఫైటర్ బ్రేక్ చేసింది. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఫైటర్ రికార్డు

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన మూవీ ఫైటర్. ఈ సినిమా మార్చి 21న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అయితే మొదటి పది రోజుల్లోనే ఈ సినిమా రణ్‌బీర్ కపూర్ యానిమల్, షారుక్ ఖాన్ డంకీ సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. ఈ విషయాన్ని గురువారం (ఏప్రిల్ 4) హృతిక్ తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తొలి పది రోజుల్లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న హిందీ సినిమాగా ఫైటర్ నిలిచింది.

ఈ రికార్డు బ్రేకింగ్ విషయాన్ని మొదట బాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. "ఓ బాలీవుడ్ సినిమా గత రికార్డులన్నింటినీ నెట్‌ఫ్లిక్స్ లో ఫైటర్ బ్రేక్ చేసింది. యానిమల్, డంకీలాంటి సినిమాలను దాటేసింది. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో తొలి పది రోజుల్లోనే 12.4 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ నంబర్లను అత్యంత వేగంగా అందుకున్న బాలీవుడ్ సినిమా ఇదే" అని చెప్పింది.

ఈ ట్వీట్ ను హృతిక్ తన ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. సుమారు 55 రోజుల తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అప్పటి వరకూ ఈ ఓటీటీలో దుమ్ము రేపుతున్న సలార్ ని వెనక్కి నెట్టి రికార్డులు బ్రేక్ చేసింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ డంకీ మూవీ వచ్చినా కూడా యానిమల్ హవా కొనసాగింది.

ఫైటర్ బాక్సాఫీస్

ఫైటర్ మూవీ జనవరి 25న రిలీజైంది. గతేడాది అదే రోజున పఠాన్ మూవీతో వచ్చి రికార్డు కలెక్షన్లు రాబట్టిన సిద్ధార్థ్ ఆనందే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. హృతిక్, దీపికా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే అనుకున్న స్థాయిలో కలెక్షన్లు మాత్రం సాధించలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ల సినిమా ఇదే అయినా.. ఇంత తక్కువ వసూళ్లు మాత్రం ఊహించలేదు. అయితే థియేటర్లలో సక్సెస్ కాని ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువే సక్సెసైంది. పుల్వామా దాడి, ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఫైటర్ మూవీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. ఇందులో హృతిక్, దీపికా కెమెస్ట్రీ మాత్రం ఆకర్షించింది. ఈ ఇద్దరూ మరోసారి కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు.

Whats_app_banner