Animal: కూతురికి 250 కోట్ల బంగ్లా గిఫ్టుగా ఇచ్చిన యానిమల్ హీరో.. షారుక్, అమితాబ్ భవనాలను మించిన ఇల్లు!-animal actor ranbir kapoor gift 250 cr bungalow to daughter raha kapoor youngest richest star kid in bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Animal Actor Ranbir Kapoor Gift 250 Cr Bungalow To Daughter Raha Kapoor Youngest Richest Star Kid In Bollywood

Animal: కూతురికి 250 కోట్ల బంగ్లా గిఫ్టుగా ఇచ్చిన యానిమల్ హీరో.. షారుక్, అమితాబ్ భవనాలను మించిన ఇల్లు!

Sanjiv Kumar HT Telugu
Mar 29, 2024 12:24 PM IST

Ranbir Kapoor Gift To Daughter Raha Kapoor: యానిమల్ మూవీ హీరో రణ్‌ బీర్ కపూర్ తన కూతురు రాహా కపూర్‌కి రూ. 250 కోట్ల ఖరీదైన బంగ్లా బహుమతిగా ఇచ్చాడు. దాంతో బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లలోనే అత్యంత ధనవంతురాలైన పిన్న వయుస్కురాలిగా రాహా కపూర్ రికార్డుకెక్కింది.

కూతురికి 250 కోట్ల బంగ్లా గిఫ్టుగా ఇచ్చిన యానిమల్ హీరో.. షారుక్, అమితాబ్ భవనాలను మించిన ఇల్లు!
కూతురికి 250 కోట్ల బంగ్లా గిఫ్టుగా ఇచ్చిన యానిమల్ హీరో.. షారుక్, అమితాబ్ భవనాలను మించిన ఇల్లు!

Animal Hero Ranbir Kapoor Gift To Daughter: యానిమల్ సినిమాతో బాలీవుడ్ హీరో రణ్‌ బీర్ కపూర్ సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీతో తెలుగులోను మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రణ్ బీర్ కపూర్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో సీతగా ప్రశంసలు అందుకుంది బాలీవుడ్ బ్యూటి అలియా భట్. ఈ దంపతులిద్దరికి రాహా కపూర్ జన్మించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కూతురు రాహా కపూర్‌కు రణ్‌బీర్ కపూర్ అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు సమాచారం.

ధనవంతురాలైన స్టార్ కిడ్

ముంబై బాంద్రా నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. బాలీవుడ్ లైఫ్ నివేదిక ప్రకారం.. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దాంతో ఏడాది వయసున్న రాహా కపూర్ బాలీవుడ్‌లో అత్యంత చిన్న వయుసులో అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్‌గా రాహా కపూర్ పేరుగాంచనుందని తెలుస్తోంది.

షారుక్ మన్నత్, అమితాబ్ జల్సా కంటే ఖరీదు

ఈ కొత్త బంగ్లాకు రణ్ బీర్ అండ్ ఫ్యామిలీకి దాదాపుగా రూ.250 కోట్లు ఖర్చయిందని సమాచారం. అయితే, బంగ్లా ఖరీదుతో చూస్తే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మన్నత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. అంటే, బాలీవుడ్ టాప్ మోసట్ సెలబ్రిటీల బంగ్లాను అధిగమించి ముంబైలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ భవనం ఇదేనని బాలీవుడ్ లైఫ్ తెలిపింది. రణ్‌ బీర్, అలియా ఇద్దరూ కలిసి కష్టపడి సంపాదించిన డబ్బును తమ డ్రీమ్ హౌస్ కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నారని ఈ పోర్టల్ వర్గాలు తెలిపాయి.

మరో నాలుగు ప్లాట్స్

భవనం పూర్తి నిర్మాణం అయ్యేసరికి ఇంటికి రూ.250 కోట్లకు పైగా ఖర్చవుతుందట. షారుఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సాలతో పోలిస్తే ముంబై ప్రాంతంలో అత్యంత ఖరీదైన బంగ్లా ఇదే కానుందని ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో టాపిక్ హాట్‌గా మారింది. అయితే, ఈ ఇంటికి తాను పిచ్చిగా ప్రేమించే తన కూతురు పేరే పెడతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ఖరీదైన బంగ్లాతో పాటు, బాంద్రా ప్రాంతంలో అలియా, రణ్ బీర్ ఇద్దరికీ నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగా ఉంటుంది.

సహా యజమానిగా నానమ్మ

అయితే, బంధువుల నుంచి వచ్చే బహుమతులకు భారతదేశంలో పన్ను మినహాయింపు ఉంటుంది. ఇలా వచ్చిన ఆస్తులకు భవిష్యత్తులో వచ్చే ఆదాయం లేదా లాభాలపై పన్నులు పడతాయని లైవ్ మింట్ తెలిపింది. కాబట్టి రాహా కపూర్ బంగ్లాకు రెంట్ రూపంలో గానీ, ఇంకా వేరే ఇతర మార్గాల్లా వచ్చే ఆదాయంపై పన్ను పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ బంగ్లాకు రాహా కపూర్ నానమ్మ నీతూ కపూర్ సహా యజమానిగా ఉంటారని సమాచారం.

15 కోట్ల విలాసవంతమైన ఇల్లు

నీతూ కపూర్ భర్త, దివంగత నటుడు రిషి కపూర్ ఆమెను తన ఆస్తులన్నింటికీ సగం యజమానిగా చేశారని బాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక నీతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే, బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్‌తో సహా కపూర్ ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు ప్రాంతంలో ఉంటున్నారు.

తన కూతురు రాహా

కపూర్ ను పిచ్చిగా, గాఢంగా ప్రేమిస్తున్న రణ్ బీర్ కపూర్ ఆ బంగ్లాకు ఆమె పేరు పెడతారని, దీంతో ఆ చిన్నారి బి-టౌన్ (బాలీవుడ్)లో అత్యంత ధనవంతుడైన స్టార్ కిడ్ గా ఎదుగుతాడని అంటున్నారు. ఈ భారీ బంగ్లాతో పాటు, బాంద్రా ప్రాంతంలో అలియా, రణ్బీర్ ఇద్దరికీ నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి, దీని విలువ రూ .60 కోట్లకు పైగా ఉంటుంది.

బంధువుల నుంచి వచ్చే బహుమతులకు భారతదేశంలో పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ, ఈ ఆస్తుల నుండి భవిష్యత్తులో వచ్చే ఆదాయం లేదా లాభాలపై పన్నులు పడతాయని లైవ్ మింట్ తెలిపింది.

బంగ్లాకు నీతూ కపూర్ సహ యజమానిగా రాహా

నానమ్మ నీతూ కపూర్ ఉంటారని, ఆమె భర్త, దివంగత నటుడు రిషి కపూర్ ఆమెను 'తన ఆస్తులన్నింటికీ సగం యజమాని'గా చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నీతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారని సమాచారం.

బంగ్లా సిద్ధమైన తరువాత, కపూర్ కుటుంబం మొత్తం - నీతూతో సహా - ఒకే పైకప్పు కింద కలిసి ఉంటుందని ఊహాగానాలు కూడా ఉన్నాయి. అలియా, రణ్ బీర్ ప్రస్తుతం రాహా అట్ వస్తులో నివసిస్తున్నారు.

వినోదం! వినోదం! వినోదం! 🎞️🍿💃 గాసిప్ 📲 లు, సినిమాలు, షోలు, సెలబ్రిటీల అప్ డేట్స్ అన్నీ ఒకే చోట మీ రోజువారీ మోతాదును అనుసరించడానికి క్లిక్ చేయండి

WhatsApp channel