Sandeep Reddy Vanga: వాళ్లు నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్-animal director sandeep reddy vanga about moving to hollywood if the stop me in india over criticism ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sandeep Reddy Vanga: వాళ్లు నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్

Sandeep Reddy Vanga: వాళ్లు నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 17, 2024 10:45 AM IST

Sandeep Reddy Vanga Moving To Hollywood: యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హాలీవుడ్‌కు వెళ్తానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లు ఆ విషయంలో ఆపినా, మరోసారి అలా చేసిన హాలీవుడ్‌కు వెళ్తానని, తనకు భాషా బేధం లేదని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.

వాళ్లు నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్
వాళ్లు నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్

Sandeep Reddy Vanga About Critics: గతేడాది నుంచి సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోతుంది. ఎక్కువగా బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీనే. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ మాసీవ్ హిట్ అందుకుంది. సినిమాలోని బీజీఎమ్, సీన్స్, స్క్రీన్ ప్లే, సందీప్ రెడ్డి టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

విమర్శలు స్టార్ట్

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్ మూవీ లాంగ్ రన్‌లో రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఇటీవల ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మూవీపై, సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. యానిమల్‌లో బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తోందని కామెంట్స్ చేశారు.

వారేంటో తెలుసుకుని

అలా కామెంట్స్ చేసిన ప్రతి ఒక్క క్రిటిక్‌కు, యాక్టర్స్‌కు గట్టిగానే సమాధానం ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. "సాధారణ జనం అంటే నేను పెద్దగా పట్టించుకునేవాన్ని కాదు. కానీ, ఇండస్ట్రీలో ఉండి అన్ని తెలిసిన పాపులర్ యాక్టర్స్ అలా అనడం బాధగా ఉంది. ఎవరైనా సరే ఇతరులను అనేముందు వారు గతంలో ఏం చేశారో చూసుకుని అనాలి" అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఈ క్రిటిక్స్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా వార్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు యానిమల్ డైరెక్టర్.

నాకు భాషా బేధం లేదు

"ఒకవేళ వాళ్లు (క్రిటిక్స్, విమర్శించే వాళ్లు) నన్ను ఇండియాలో ఆపితే నేను హాలీవుడ్‌కు వెళ్లిపోతా. నాకు భాషా పరిమితులు అంటూ ఏం లేవు. నేను భోజ్‌పురి, కన్నడ, మలయాళం, పంజాబీతోపాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తాను" అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. తనపై, యానిమల్ మూవీపై విమర్శలు ఎక్కువగా వచ్చేసరికి తాజాగా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అయితే, ఏది ఏమైనా యానిమల్‌కు సీక్వెల్ యానిమల్ పార్క్‌ను తెరకెక్కించేందుకు డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

హిందీలోనే తీయాలని

యానిమల్ క్లైమాక్స్‌లో యానిమల్ పార్క్ ఎలా ఉంటుందో ఆల్రెడీ హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. కాగా సందీప్ రెడ్డి వంగా కెరీర్‌లో మూడు సినిమాలు తెరకెక్కించి సూపర్ క్రేజ్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డితో తెలుగులో ఆకట్టుకుని తర్వాత అదే సినిమాను కబీర్ సింగ్‌గా హిందీలో రీమేక్ చేశాడు. ఇక మూడో సినిమాను హిందీలోనే తీయాలని యానిమల్ తెరకెక్కించాడు. ఇప్పుడు యానిమల్ పార్క్‌పై ఫోకస్ పెట్టాడు. దీని తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ మూవీని పక్కా తెలుగులోనే తీయాలని అనుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగా.

ప్రభాస్-మహేశ్ బాబుతో

ప్రభాస్ స్పిరిట్ మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఫుల్ లెంత్ వయెలెన్స్ మూవీ డెవిల్‌ను తెరకెక్కించనున్నట్లు ఇదివరకు సందీప్ రెడ్డి వంగా హింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా సినిమా ఆఫర్స్ దక్కించుకోవడం, మూవీస్ తీయడం సులభం అనుకున్నాడని, కానీ, ఇక్కడికి వచ్చాకా అది ఎంత కష్టమో తర్వాత అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో ప్రమోషన్స్‌లో భాగంగా తెలిపాడు.

Whats_app_banner