Heart Of Stone Review: హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ రివ్యూ.. విలన్‍గా అలియా భట్ మెప్పించిందా?
Heart Of Stone Review Telugu: బాలీవుడ్ ముద్దుగుమ్మ, RRR సీత అలియా భట్ తొలిసారిగా నటించిన హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్. హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ గా పేరొందిన పాపులర్ నటి గాల్ గాడోట్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ ఓటీటీలో ఆగస్ట్ 11న నెట్‍ఫ్లిక్స్ లో విడుదలైంది.
Heart Of Stone Movie Review: RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటి అలియా భట్ (Alia Bhatt). ఇటీవల సౌత్, నార్త్ హీరోయిన్స్ హాలీవుడ్ బాట పడుతున్న విషయం తెలిసిందే. సొంత ఇండస్ట్రీలో నటనపరంగా సత్తా చాటి గ్లోబల్‍గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ఇటీవల బాలీవుడ్ క్యూట్ బ్యూటి అలియా భట్ 'హార్ట్ ఆఫ్ స్టోన్' మూవీతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. వండర్ వుమెన్ ఫేమ్ గాల్ గాడోట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్ట్ 11న నేరుగా ఓటీటీలో (Heart Of Stone OTT) రిలీజ్ కాగా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రేచల్ స్టోన్ (గాల్ గాడోట్) ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీ అయిన 'ది చార్టర్'లో ప్రతిభావంతురాలైనా ఏజెంట్. మిషన్ లో భాగంగా బ్రిటీష్ గూఢచార సంస్థ ఎంఐ6లో కొత్త స్పైగా జాయిన్ అవుతుంది. ఎంఐ6తో కలిసి ఇటలీలో ఓ మిషన్ చేపడుతారు. కానీ, అది ఫెయిల్ అవుతుంది. అందుకు కారణం 22 ఏళ్ల యువతి కేయా ధావన్ అని తెలుసుకుంటుంది రేచల్ స్టోన్. అసలు కేయా ధావన్ ఎవరు? ఆమె గతం ఏంటి? ఆమె ఎవరి కోసం పని చేస్తుంది? చార్టర్ ఏజెన్సీ ఉపయోగించే హార్ట్ అనే డివైస్‍ను కేయా ఎందుకు చేజిక్కుంచుకోవాలనుకుంది? ఆ హార్ట్ డివైస్ ద్వారా చార్టర్ ఏం చేస్తుంది? వంటి ఆసక్తిర అంశాల సమ్మేళనమే హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ.
విశ్లేషణ:
యాక్షన్, స్పై సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా తెరకెక్కించే విధానం ఆకట్టుకుంటే సినిమా టీమ్ సక్సెస్ అయినట్లే. కానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ టీమ్ అందులో విఫలమైనట్లే చెప్పుకోవచ్చు. మిషన్ ఇంపాజిబుల్ వంటి హై ఓల్టేజ్ యాక్షన్ స్పై మూవీస్ చూసిన సినీ ప్రియులకు హార్ట్ ఆఫ్ స్టోన్ పెద్దగా రుచించకపోవచ్చు. ఓ మిషన్‍తో సినిమాను ప్రారంభించగా.. రేచల్ స్టోన్ పాత్రను ఎలివేట్ చేసే తీరు ఆకట్టుకుంటుంది. అప్పుడే విలన్‍గా కేయా ధావన్ (అలియా భట్) ఎంట్రీ ఆశ్చర్యపరుస్తుంది. కానీ, తర్వాత సాగే సన్నివేశాలు అంత కిక్ అందించవు.
ఊహించే ట్విస్ట్
పోర్చుగల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సినిమాలో గంట తర్వాత వచ్చే ట్విస్ట్ మూవీ ప్రారంభమైన కొద్దిసేపటికే గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి తరహా సినిమాలు ఎన్నో వచ్చి హిట్ కొట్టాయి. ఉమెన్ ఒరియెంటెడ్ స్పై యాక్షన్ మూవీగా వచ్చిన హార్ట్ ఆఫ్ స్టోన్ స్టోరీని ఇంకాస్తా బలంగా రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ ఓకే. అలియా భట్ క్యారెక్టర్ మొదట్లో చాలా పవర్ ఫుల్ గా ఉన్నా తర్వాత డల్ అయిపోతుంది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు.
ఎవరెలా చేశారంటే?
హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న గాల్ గాడోట్ మరోసారి ఆకట్టుకుంటుంది. అలియా భట్ కూడా తన పాత్రకు తగినట్లుగా అలరించింది. ఆమె నుంచి అంతగా యాక్షన్ సీన్స్ అయితే పడలేదు. జేమీ డోర్నాన్‍తోపాటు ఇతర నటీనటుల యాక్టింగ్ బాగుంది. రెండు గంటల నిడివి ఉన్న హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart Of Stone OTT Movie Review) సినిమా చాలా బోరింగ్‍గా, కొంచెం ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. ఫ్రీ టైమ్ ఉంటే వీకెండ్‍లో ఓ లుక్కెయొచ్చు.