Unstoppable With NBK: రష్మికను ఇరికించిన బాలయ్య.. విజయ్, రణ్‌బీర్ ఇద్దరిలో ఎవరు బాగున్నారంటూ ఫిటింగ్-unstoppable with nbk episode promo balakrishna with ranbir rashmika sandeep reddy vanga ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk: రష్మికను ఇరికించిన బాలయ్య.. విజయ్, రణ్‌బీర్ ఇద్దరిలో ఎవరు బాగున్నారంటూ ఫిటింగ్

Unstoppable With NBK: రష్మికను ఇరికించిన బాలయ్య.. విజయ్, రణ్‌బీర్ ఇద్దరిలో ఎవరు బాగున్నారంటూ ఫిటింగ్

Sanjiv Kumar HT Telugu

Unstoppable With NBK Season 3: నందమూరి నటిసింహం బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ కొత్త సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. అందులో రష్మిక మందన్నాకు పెద్ద ఫిటింగ్ పెట్టాడు బాలయ్య. అలాగే రణ్‌బీర్, సందీప్ రెడ్డిలను ఆడుకున్నాడు.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ ప్రోమోలో రష్మిక మందన్నా, రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా

Unstoppable 3 Rashmika Ranbir Promo: బాలకృష్ణ హోస్టుగా అదరగొడుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలైంది. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో స్పెషల్‌గా ప్రారంభమైన ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వారితో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా హాజరయ్యాడు.

నవంబర్ 24 నుంచి ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమోలో విస్కీ ఆపేసి నా బ్రాండ్‌కు వచ్చేయవయ్యా. త్వరగా కథలు రాయడం మొదలు పెడతావ్ అని సందీప్ రెడ్డిని బాలకృష్ణ అన్నాడు. బోయపాటి శ్రీనుపై అభిప్రాయం చెప్పమని అడిగితే.. ప్రతి సినిమాలో యాక్షన్ సీన్స్ గుడిలో తీస్తుంటారని సందీప్ చెప్పాడు. త్రివిక్రమ్ గురించి అడిగితే.. సైలెంట్ అయిపోయాడు.

అనంతరం రణ్ బీర్ కపూర్‌ స్టేజీపైకి వచ్చాడు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అని బాలయ్య డైలాగ్ చెప్పాడు రణ్ బీర్ కపూర్. తర్వాత రష్మిక మందన్నాను పిలిచిన బాలకృష్ణ తనతో డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేస్తుంటే తన గుండె మెలికలు తిరుగుతోందని బాలయ్య అన్నాడు. సుకుమార్‌తో సినిమా అంటే ఇంకో మూవీ చేయట్లేదు కదా అని బాలకృష్ణ అడిగాడు. జావా అనే హిందీ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ అని తెలుగు మూవీ చేస్తున్న అని రష్మిక చెప్పింది.

సుకుమార్ ఎలా ఒప్పుకున్నాడని బాలయ్య అడిగితే.. ఆయనకు తెలుసని రష్మిక నవ్వుతు బదులిచ్చింది. అనంతరం స్క్రీన్ పై అర్జున్ రెడ్డి, యానిమల్ పోస్టర్స్ చూపించారు. ఎవరు బెటర్ హీరో అని రష్మికను అడగండి అని రణ్ బీర్ కపూర్ అన్నాడు. దాంతో ఇద్దరిలో ఎవరు బాగున్నారు అని రష్మికను బాలయ్య అడిగాడు. దాంతో రష్మిక నవ్వేసింది. ఫిటింగ్ పెట్టినట్లు బాలకృష్ణ ప్రేక్షకులతో సైగ చేశాడు.

అనంతరం రష్మికతో వాట్స్ హాపెనింగ్ అని విజయ్ దేవరకొండ ఫోన్‌లో మాట్లాడాడు. మేడ మీద పార్టీలు ఏంటన్న అని బాలకృష్ణ అన్నాడు. మీ లవ్ చెప్పమని సందీప్‌ను అడిగిన బాలకృష్ణ ఐ లవ్ రష్మిక అని అన్నాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ప్రోమో సాగింది.