Fighter OTT Release Date: ఫైటర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది-fighter ott release date hrithik roshan deepika padukone movie will stream on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fighter Ott Release Date: ఫైటర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Fighter OTT Release Date: ఫైటర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Fighter OTT Release Date: ఫైటర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Fighter OTT Release Date: ఫైటర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Fighter OTT Streaming: ఫైటర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

స్ట్రీమింగ్ డేట్

ఫైటర్ హిందీ సినిమా స్ట్రీమింగ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. రేపు (మార్చి 21) ఈ చిత్రం తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని ప్రకటించింది. మార్చి 21 అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్‍ ల్యాండ్ కానుందని సోషల్ మీడియాలో నేడు (మార్చి 20) అనౌన్స్ చేసింది.

ఫైటర్ సినిమా తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంపై నెట్‍ఫ్లిక్స్ క్లారిటీ ఇవ్వలేదు. హిందీలో వస్తుందని కన్ఫార్మ్ చేసింది. “ల్యాండ్ అయ్యేందుకు ఫైటర్ సిద్ధమైంది. ఈ రాత్రి 12 గంటలకు (మార్చి 21) నెట్‍ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీంతో మరిన్ని గంటల్లో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయవచ్చు.

ఫైటర్ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఏరియల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వచ్చింది. యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్‍ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ కీరోల్స్ చేశారు.

ఫైటర్ కలెక్షన్లు

ఫైటర్ సినిమా భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డేకు ఒక్క రోజు ముందు జనవరి 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఓపెనింగ్ అనుకున్న స్థాయిలో రాలేదు. అయితే, పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమాకు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.337 కోట్ల కలెక్షన్లు దక్కాయి. దీంతో కమర్షియల్‍గానూ ఈ సినిమా మంచి హిట్ అయింది.

ఫైటర్ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్ల నిర్మించాయి. మమతా ఆనంద్, అజిత్ అంధారే, అంకూ పాండే, రామోన్ చిబ్, కెవిన్ వాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలోని పాటలకు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా స్వరాలు సమకూర్చగా.. విశాల్, శేఖర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సత్‍చిత్ పౌలోస్ సినిమాటోగ్రఫీ చేశారు.

హృతిక్ రోషన్ తర్వాతి సినిమా

హృతిక్ రోషన్ తదుపరి ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. యశ్‍రాజ్ ఫిల్మ్ (YRF) యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కనుంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ ప్రధాన పాత్ర చేయనున్నారు. దీంతో ఈ మూవీకి భారీ హైప్ ఉంది. దేవర పూర్తయ్యాక వార్ 2 షూటింగ్‍లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు.