Aditi Rao Hydari - Siddharth: సిద్ధార్థ్ ఓకే చెప్పాడంటూనే ట్విస్ట్ ఇచ్చిన అదితి రావ్ హైదరి
Aditi Rao Hydari - Siddharth Engagement: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి రహస్యంగా వివాహం చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఓ దేవాలయంలో వారు పెళ్లాడారని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంలో అదితి ఓ ట్విస్ట్ ఇచ్చారు.
Aditi Rao Hydari - Siddharth: హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి విషయంలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. వారిద్దరి పెళ్లి జరిగిందంటూ బుధవారం నుంచి సమాచారం చక్కర్లు కొడుతోంది. వనపర్తిలోని శ్రీరంగాపురం దేవాలయంలో వారి పెళ్లి.. రహస్యంగా జరిగిందని కూడా రూమర్లు బయటికి వచ్చాయి. వారి వివాహం జరిగిందని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారని సమాచారం వచ్చింది. అయితే, ఈ వ్యవహారంలో అదితి రావ్ హైదరి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ఎంగేజ్‍మెంట్
సిద్ధార్థ్‌తో తన వివాహం జరిగిందని రూమర్లు వస్తున్న తరుణంలో నేడు (మార్చి 28) అదితి రావ్ హైదరి స్పందించారు. తమకు ఎంగేజ్‍మెంట్ జరిగిందంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. సిద్ధార్థ్ ఓకే చెప్పాడని క్యాప్షన్ రాశారు.
ఎంగేజ్‍మెంట్ జరిగిందని తెలిసేలా అదితి రావ్ హైదరి ఓ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో సిద్ధార్థ్, అదితి చేతులకు ఉంగరాలు ఉన్నాయి. ఈ ఫొటో పోస్ట్ చేసి.. తమకు నిశ్చితార్థమైందని అదితి పేర్కొన్నారు. అయితే, తాము వనపర్తి సమీపంలోని శ్రీరంగాపురంలోనే ఉన్నామని లొకేషన్ వివరాలను కూడా షేర్ చేశారు.
ట్విస్టే ఇది..
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి పెళ్లి జరిగిపోయిందని బుధవారం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రచారం ఇష్టంలేక రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నారని టాక్ వచ్చింది. తమకు షూటింగ్ అని సిద్ధార్థ్, అదితి చెప్పారని ఆ దేవాలయం నిర్వాహకులు వెల్లడించినట్టు కూడా రూమర్లు వచ్చాయి. మొత్తంగా, వీరి పెళ్లి వ్యవహారం కాస్త గందరగోళంగా అనిపింది. అయితే, తమ పెళ్లి కాలేదని, ఎంగేజ్‍మెంట్ మాత్రమే చేసుకున్నామని అదితి నేడు పెద్ద ట్విస్టే ఇచ్చారు.
అదితి రావ్ హైదరికి వివాహం అయిందని, అందుకే హీరామండి వెబ్ సిరీస్ ఈవెంట్‍కు ఆమె హాజరు కాలేదని హోస్ట్ చెప్పినట్టు కూడా రిపోర్టులు వచ్చాయి. దీంతో అదితి, సిద్ధార్థ్ వివాహమైందని అందరూ భావించారు. అయితే, ఎంగేజ్‍మెంట్ మాత్రమే చేసుకున్నానని ఆమె ఇప్పుడు చెప్పారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న హీరామండి వెబ్ సిరీస్‍లో అదితి రావ్ హైదరి, మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీద షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మే 1న స్ట్రీమింగ్‍కు రానుంది. బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని భన్సాలీ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్‍తోనే ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని పెంచేసింది.
‘మహా సముద్రం’ కలిపింది ఇద్దరినీ..
మహా సముద్రం సినిమా సమయంలో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి మధ్య పరిచయం ఏర్పడింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో సిద్ధార్థ్, అదితి హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. చాలా ఈవెంట్లకు జంటగా వెళ్లారు. కలిసి విహారయాత్రలకు వెళ్లిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో తాము ప్రేమలో ఉన్నామని, చెప్పకనే చెప్పేశారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ ఎంగేజ్‍మెంట్ చేసుకొని.. తమ బంధాన్ని తర్వాతిస్థాయికి తీసుకెళ్లారు.