Aditi Rao Hydari wedding: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. ఆ ఈవెంట్‍లో అనౌన్స్‌మెంట్
Siddharth - Aditi Rao Hydari Marriage: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి పెళ్లి చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. రహస్యంగా వీరిద్దరూ వివాహమాడారని తెలింసింది. అయితే, ఈ విషయంపై తాజాగా ఓ ఈవెంట్‍లో క్లారిటీ వచ్చేదింది.
Siddharth - Aditi Rao Hydari Marriage: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి సుమారు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు డేటింగ్‍లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు, వెకేషన్లకు వెళ్లారు. కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, లవ్‍లో ఉన్నామని సిద్ధార్థ్, అదితి నేరుగా చెప్పలేదు. పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు. అయితే, వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న సమాచారం తాజాగా బయటికి వచ్చింది.
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి బుధవారం (మార్చి 27) వివాహం చేసుకున్నారని వెల్లడైంది. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగిందని సమాచారం బయటికి వచ్చింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు మరికొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారని తెలిసింది. హడావుడి లేకుండా రహస్యంగా ఈ వేడుక జరిగింది. అయితే, ఈ విషయం సిద్ధార్థ్, అదితి నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పెళ్లిపై ఇంకా కాస్త సందేహాలు ఉండేవి. అయితే, వాటిపై తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అందుకే రాలేదు
అదితి రావ్ హైదరి ప్రధాన పాత్ర పోషించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‍కు సంబంధించిన ఈవెంట్ బుధవారం (మార్చి 27) రాత్రి జరిగింది. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేందుకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ జరిగింది. ఆ సందర్భంగా అదితి రావ్ హైదరి పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది.
పెళ్లి కారణంగానే అదితి రావ్ హైదరి ఈ ఈవెంట్‍కు రాలేకపోయారని హోస్ట్ సచిన్ కుంభర్ అనౌన్స్ చేశారు. దీంతో అదితి పెళ్లి జరిగిందని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. “హీరామండిలో అదితి ఒక ముఖ్యమైన భాగం. కానీ ఆమె ఇక్కడి రాలేదు. ఇందుకో కారణం ఉంది. నేడు ఆమె వివాహం చేసుకున్నారు. అందుకే మనం ఆమెకు అభినందనలు తెలపాలి” అని హోస్ట్ అన్నారు.
హీరామండి ఈవెంట్‍లో ప్రకటన రావటంతో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి పెళ్లిపై స్పష్టతవచ్చేసింది. మరి, వారిద్దరు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
అప్పటి నుంచే ప్రేమ
2021లో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి కలిసి మహాసముద్రం చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ మూవీ దర్శకుడు అజయ్ భూపతి కూడా గతంలో ఓ సందర్భంగా వీరిద్దరి ప్రేమ గురించి చెప్పారు. మొత్తంగా సుమారు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, అదితి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా, సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో అదితితో పాటు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చడ్డా, సంజీద షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1940ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందుతోంది.
టాపిక్