Siddharth Aditi marriage: వనపర్తిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ-siddharth aditi rao hydari secretly married in wanaparthy sri ranganayakaswamy temple says some reports ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth Aditi Marriage: వనపర్తిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ

Siddharth Aditi marriage: వనపర్తిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ

Hari Prasad S HT Telugu
Mar 27, 2024 02:48 PM IST

Siddharth Aditi marriage: లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అది కూడా తెలంగాణలోని వనపర్తి దగ్గరలో ఉన్న శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో కావడం విశేషం.

వనపర్తిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ
వనపర్తిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ

Siddharth Aditi marriage: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్ లోనూ మెరిసిన నటుడు సిద్ధార్థ్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. చాలా రోజులుగా నటి అదితి రావ్ హైదరీతో అతడు రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ బుధవారం (మార్చి 27) వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో కొంతమంది సమక్షంలోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం గమనార్హం.

సిద్ధార్థ్, అదితి పెళ్లి

నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావ్ రెండేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు ఎప్పుడూ తమ బంధాన్ని నేరుగా బయటపెట్టకపోయినా.. చాలాసార్లు పబ్లిగ్గా జంటగా కనిపించి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపైర్ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వీళ్లు పెళ్లితో ఒక్కటవడం విశేషం. అయితే ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడం కొత్త కాకపోయినా.. కనీసం పెళ్లి తర్వాత అయినా వీళ్లు ఒక్క ఫొటోను కూడా బయటపెట్టలేదు. ఆన్‌లైన్లోనూ ఫొటోలు లీకవకుండా చూసుకున్నారు. బుధవారం (మార్చి 27) ఉదయమే శ్రీరంగనాథ ఆలయంలో పెళ్లి జరిగింది.

ఈ వార్త సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో వచ్చిన మహా సముద్రం మూవీలో సిద్ధార్థ్, అదితి కలిసి నటించారు. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లు ప్రతిసారి జంటగా కనిపించి ఆ రూమర్లను నిజం చేశారు. చివరికి అధికారికంగా తమ బంధం గురించి బయటపెట్టకుండా నేరుగా పెళ్లితో ఒక్కటైపోయారు.

వనపర్తికి, అదితికి లింకేంటో తెలుసా?

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ వనపర్తి జిల్లాలో పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణమే ఉంది. అదితి మూలాలు మన తెలంగాణలోనే ఉన్నాయి. ఆమె తల్లి విద్యా రావు తండ్రి వనపర్తి చివరి రాజు రామేశ్వర రావు. ఇక అదితి తండ్రి పేరు ఎహసాన్ హైదరీ.

ఆయన హైదరాబాద్ స్టేట్ కు ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీ మనవడు. ఇలా అదితి రావ్ మూలాలు మొత్తం తెలంగాణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె పెళ్లి కూడా తెలంగాణలోని వనపర్తిలోనే జరిగింది.

సిద్ధార్థ్, అదితి ప్రాజెక్ట్స్

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ తరచూ రీల్స్ చేస్తూ కూడా అభిమానులతో టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం అదితి రావ్ హైదరీ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న వెబ్ సిరీస్ హీరామండిలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. గాంధీ టాక్స్, ఇంగ్లిష్ మూవీ లయనెస్ లాంటి వాటిలోనూ ఆమె నటిస్తోంది.

మరోవైపు సిద్ధార్థ్ గతేడాది చిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సిద్ధార్థ్ ఇండియన్ 2 మూవీలోనూ నటించాడు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.