Keedaa Cola OTT Release: ఎట్టకేలకు ‘కీడాకోలా’ మూవీ ఓటీటీ రిలీజ్‍పై అప్‍డేట్
Keedaa Cola OTT Release: కీడా కోలా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎట్టకేలకు ప్రకటన వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏ ఓటీటీలోకి రానుందంటే..
Keedaa Cola OTT Release: యూత్‍లో మంచి క్రేజ్ ఉన్న తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘కీడా కోలా’ సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ, డిఫరెంట్ నరేషన్‍తో ఈ చిత్రం అలరించింది. ఎక్కువగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన భారీగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. చైతన్యరావు, కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, కీడా కోలా ఓటీటీ రిలీజ్‍పై ఎట్టకేలకు ప్రకటన వచ్చింది.
కీడా కోలా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‍ను రేపు వెల్లడించనున్నట్టు ఆహా నేడు (డిసెంబర్ 18) ట్వీట్ చేసింది. “ఈ సీసాలో ఏదో క్రేజీగా ఉంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు త్వరలో వస్తోంది. కోడాకోలా రిలీజ్ డేట్ రేపు ప్రకటిస్తాం” అని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. సీసాలో నుంచి బొద్దింక వచ్చేలా మూవీ థీమ్‍తో ఓ వీడియో పోస్ట్ చేసింది.
కీడా కోలా సినిమా ఓటీటీలోకి అప్పుడొస్తోంది.. ఇప్పుడొస్తోంది అంటూ కొంతకాలం నుంచి కొన్ని రూమర్లు వచ్చాయి. ఆ తేదీలు దాటిపోతున్నా.. సినిమా మాత్రం స్ట్రీమింగ్‍కు రాలేదు. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ గురించి ఆహా అప్‍డేట్ ఇచ్చింది. రేపు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను ప్రకటించనుంది.
ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. డైరెక్షన్‍కు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కీడాకోలాను తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా తరుణ్ మార్క్‌తోనే అలరించింది. కీడాకోలా సినిమాలో చైతన్య రావ్, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్, రఘురామ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో నటనతోనే మెప్పించారు తరుణ్ భాస్కర్.
కీడా కోలా సినిమాను వివేక్ సుదాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస కౌశిక్, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
ఇదీ కథ
వాస్తు (చైతన్య రావ్), అతడి తాత వరదరాజు (బ్రహ్మానందం) కొన్న ఓ కూల్ డ్రింక్ బాటిల్‍లో బొద్దింక ఉంటుంది. దీంతో ఆ కోలా కంపెనీ యజమానిని బ్లాక్‍మెయిల్ చేసి డబ్బు రాబట్టాలని వారు వ్యూహం రచిస్తారు. అలాగే, మరికొన్ని గ్యాంగ్‍లు కూడా ఆ బాటిల్‍ను దక్కించుకునేందుకు కుట్ర పన్నుతాయి. ఆ కూల్‍డ్రింక్ బాటిల్ కోసం ఎవరు.. ఎందుకు అంత తాపత్రయపడ్డారు? చివరికి డబ్బు ఎవరికి దక్కింది? అసలు ఆ కూల్‍డ్రింక్‍లో బొద్దింక ఎలా పడింది? అనేదే కీడాకోలా ప్రధాన కథగా ఉంది.