Aha OTT: బోల్డ్ కంటెంట్‍పై కూడా ఫోకస్ పెంచుతున్న ఆహా ఓటీటీ! బెంచింగ్‍ పేరుతో మూవీ అనౌన్స్‌మెంట్-aha ott platform increasing focus on bold content and announced dating trend benching original film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: బోల్డ్ కంటెంట్‍పై కూడా ఫోకస్ పెంచుతున్న ఆహా ఓటీటీ! బెంచింగ్‍ పేరుతో మూవీ అనౌన్స్‌మెంట్

Aha OTT: బోల్డ్ కంటెంట్‍పై కూడా ఫోకస్ పెంచుతున్న ఆహా ఓటీటీ! బెంచింగ్‍ పేరుతో మూవీ అనౌన్స్‌మెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 09, 2024 10:19 PM IST

Aha OTT: ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇటీవల కాస్త బోల్డ్ కంటెంట్‍పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా బెంచింగ్ అనే మరో బోల్డ్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని ప్రకటించింది.

Aha OTT: బోల్డ్ కంటెంట్‍పై కూడా ఫోకస్ పెంచుతున్న ఆహా! బెంచింగ్‍ పేరుతో మూవీ అనౌన్స్‌మెంట్
Aha OTT: బోల్డ్ కంటెంట్‍పై కూడా ఫోకస్ పెంచుతున్న ఆహా! బెంచింగ్‍ పేరుతో మూవీ అనౌన్స్‌మెంట్

Aha OTT: తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఆహా’ వేగంగా వృద్ధి చెందుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‍లను వరుసగా తీసుకొస్తూ చాలా పాపులర్ అయింది. రియాల్టీ షోలతోనూ అదరగొడుతోంది. ఈ ప్లాట్‍ఫామ్‍కు యూజర్లు భారీస్థాయిలో పెరిగారు. నేరుగా ఓటీటీలోకి వచ్చేలా ఒరిజినల్ చిత్రాలను పెంచుతోంది ఆహా. చాలా సినిమాలు, సిరీస్‍లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా, ఇటీవలి కాలంలో బోల్డ్ కంటెంట్‍పై కూడా ఆహా ఫోకస్ పెంచుతున్నట్టు అర్థమవుతోంది. మిక్స్అప్ పేరుతో మార్చిలో ఓ చిత్రాన్ని ఆహా తీసుకొచ్చింది. ఇప్పుడు డేటింగ్ సర్కిల్‍లో ఫేమస్ అయిన బెంచింగ్ కాన్సెప్టుతో ఓ చిత్రాన్ని ప్రకటించింది.

నేడు (ఏప్రిల్ 9) ఉగాది సందర్భంగా కొన్ని ముఖ్యమైన అనౌన్స్‌మెంట్లు చేసింది. కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లకు సంబంధించి ప్రకటన చేసింది. అయితే, ఇందులో బెంచింగ్ అనే ఓ సినిమా ఉంది. ఇది బోల్ట్ కంటెంట్‍తో ఉండనుంది.

బెంచింగ్ మూవీ.. దేని గురించి!

హాటెస్ట్ డేటింగ్ ట్రెండ్ ‘బెంచింగ్’ త్వరలోనే వస్తోందంటూ ఆహా వెల్లడించింది. ఈ చిత్రం నేరుగా ఆహాలోకి రానుంది. ఒకరితో రిలేషన్‍లో ఉంటూనే.. మీతో కూడా సంబంధం పెట్టుకోవడాన్ని డేటింగ్‍ ట్రెండ్‍లో బెంచింగ్ అని అంటారు. అంటే డేటింగ్ కోసం ఎవరైనా బ్యాక్ ఆప్షన్‍గా పెట్టుకుంటే అదే బెంచింగ్. ఇలాంటి బోల్డ్ కాన్సెప్టుతో ఆహా మూవీ తీసుకొస్తోంది.

అయితే, బెంచింగ్ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు ఇప్పుడు వెల్లడించలేదు. కేవలం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇద్దరు వ్యక్తులతో ఓ అమ్మాయి రిలేషన్‍లో ఉందని తెలిపేలా ఈ పోస్టర్ ఉంది. త్వరలోనే బెంచింగ్ మూవీ గురించి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

ఇటీవలే మిక్స్అప్

ఆహా ఓటీటీలో మార్చి 15వ తేదీన మిక్స్అప్ అనే సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజా జావేరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రెండు జంట శృంగార జీవితం గురించి బోల్డ్ కంటెంట్‍తో ఈ చిత్రం వచ్చింది. ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి.

త్రీ రోజెస్ అనే బోల్డ్ సిరీస్‍కు సీక్వెల్‍ను కూడా ఆహా ప్రకటించింది. పాయల్ రాజ్‍పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2021లో వచ్చిన త్రీ రోజెస్ సిరీస్ బాగా పాపులర్ అయింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ రానుందని ఆహా వెల్లడించింది.

ప్రేమలు స్ట్రీమింగ్ డేట్

మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 12వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ థియేయర్లలో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ లవ్ కామెడీ మూవీలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించగా.. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ప్రేమలు ఏకంగా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.

ప్రేమలు తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న ఆహాలోకి రానుంది. అయితే, అదే రోజున మలయాళం, తమిళం, హిందీ వెర్షన్‍లలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ప్రేమలు.. ఓటీటీల్లోనూ భారీ ఆదరణ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

IPL_Entry_Point