Aha OTT: పాయ‌ల్ రాజ్‌పుత్ బోల్డ్ సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది - ఆహాలో రిలీజ్ కానున్న కొత్త‌ సినిమాలు, సిరీస్‌లు ఇవే-3 roses season 2 to harivillu movie aha ott announces their upcoming web series and movies details on ugadi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: పాయ‌ల్ రాజ్‌పుత్ బోల్డ్ సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది - ఆహాలో రిలీజ్ కానున్న కొత్త‌ సినిమాలు, సిరీస్‌లు ఇవే

Aha OTT: పాయ‌ల్ రాజ్‌పుత్ బోల్డ్ సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది - ఆహాలో రిలీజ్ కానున్న కొత్త‌ సినిమాలు, సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Apr 09, 2024 01:32 PM IST

Aha OTT: ఉగాది సంద‌ర్భంగా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌ను ఆహా ఓటీటీ అనౌన్స్‌చేసింది. పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ సిరీస్‌కు సీజ‌న్ 2 రాబోతోంది. హ‌రివిల్లు, డ్రైవ్‌, రాక్ష‌సి అనే మూవీస్‌ను ప్ర‌క‌టించింది.

త్రీ రోజెస్ వెబ్ సిరీస్ సీజన్ 2
త్రీ రోజెస్ వెబ్ సిరీస్ సీజన్ 2

Aha OTT: ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆహా ఓటీటీ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌ను అనౌన్స్ చేసింది. ఎట్లిచ్చినాం అనే క్యాప్ష‌న్‌తో ఈ వెబ్ ఫిల్మ్స్‌, సిరీస్‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది. డిఫ‌రెంట్ జాన‌ర్‌లో రాబోతున్న ఈ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే?

త్రీ రోజెస్ 2 వ‌చ్చేది అప్పుడే...

పాయ‌ల్ రాజ్‌పుత్‌, ఈషారెబ్బా, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 రోబోతోంది. డైరెక్ట‌ర్ మారుతి క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సిరీస్‌కు ర‌వి నంబూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బోల్డ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది.

జాన్వీ, రీతూ, ఇందు అనే ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్ల క‌థ‌తో ఈ సిరీస్ తెర‌కెక్కింది. సీజ‌న్ 2లో కూడా పాయ‌ల్ రాజ్‌పుత్‌, ఈషారెబ్బాతో పాటు పూర్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఈ ముగ్గరు ప‌బ్‌లో మందుతాగుతోన్న పోస్ట‌ర్‌ను ఆహా ఓటీటీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. ఈ ముగ్గురు హీరోయిన్ల‌తో పాటు మ‌రికొన్ని కొత్త పాత్ర‌లు కూడా సీజ‌న్ 2లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

సిన్ 2 సీజ‌న్ 2

తిరువీర్‌, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి స‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిన్ వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది. సిన్ 2 పోస్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. తిరువీర్‌, దీప్తి సెల్ఫీ ఫొటోకు ఫోజిస్తున్న ఫొటోను పంచుకున్న‌ది. వారి ముఖాలు క‌నిపించ‌కుండా షేడ్ చేస్తూ ఈ ఫొటోలో చూపించారు.త్వ‌ర‌లోనే సిన్ 2 వెబ్‌సిరీస్ సీజ‌న్ 2ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఆహా ఓటీటీ పేర్కొన్న‌ది.

హ‌రివిల్లు మూవీ...

అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యువ‌జంట క‌థ‌తో హ‌రివిల్లు పేరుతో ఓ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు ఆహా ఓటీటీ వెల్ల‌డించింది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోన్న ఆహా ఒరిజిన‌ల్ మూవీలో హీరోహీరోయిన్లు ఎవ‌ర‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. హ‌రివిల్లుతో పాటు డ్రైవ్‌, రాక్ష‌సి, ల‌వ్ డైరీస్ సినిమాల‌ను కూడా ఆహా ఓటీటీ ఉగాది సంద‌ర్భంగా అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది.

ఎలియ‌న్ క‌థ‌తో...

రాక్ష‌సి మూవీ హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఏలియ‌న్ లాంటి వింత‌జీవి క‌థాంశంతో రాక్ష‌సి మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు క్యాప్ష‌న్ చూస్తుంటే క‌నిపిస్తోంది. ప్రేమ కోసం ఓ ముగ్గురు యువ‌కులు సాగించిన జ‌ర్నీ నేప‌థ్యంలో ల‌వ్ డైరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు ఆహా ఓటీటీ ప్ర‌క‌టించింది.

డ్రైవ‌ర్ మూవీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్ ల తాలూకు పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాలు, సిరీస్‌ల‌కు సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ప్రేమ‌లు మూవీ తెలుగు వెర్ష‌న్ ఏప్రిల్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. న‌స్లేన్‌, మ‌మితాబైజు హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మ‌ల‌యాళం మూవీని తెలుగులో రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. ప్రేమ‌లు మ‌ల‌యాళం వెర్ష‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతోంది.

IPL_Entry_Point

టాపిక్