Mix Up OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ సినిమా: స్ట్రీమింగ్ ఎక్కడంటే..-mix up movie makes direct digital streaming debut on aha ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mix Up Ott: నేరుగా ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ సినిమా: స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Mix Up OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ సినిమా: స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2024 03:20 PM IST

Mix Up OTT Streaming: ‘మిక్స్ ఆప్’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ట్రైలర్‌లో బోల్డ్ సబ్జెక్ట్ ఉండటంతో ఈ చిత్రంపై బజ్ ఏర్పడింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Mix Up OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ సినిమా: స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Mix Up OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ సినిమా: స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Mix Up: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో రకరకాల కంటెంట్‍తో సినిమాలు, వెబ్ సిరీస్‍లు వస్తూనే ఉన్నాయి. బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజా జావేరి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సహా మరిన్ని వివరాలు ఇవే.

ఆహా ఓటీటీలో..

‘మిక్స్ అప్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (మార్చి 15) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. రెండు జంటల రిలేషన్‍కు సంబంధించిన స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ రెండు జంటలు తమ శృంగార జీవితం గురించి చెప్పే ట్రైలర్‌తో ఈ న్యూఏజ్ బోల్డ్ కంటెంట్ సినిమాపై ఆసక్తి పెరిగింది.

కామంపై ప్రేమ గెలుస్తుందా? అంటూ ‘మిక్స్ ఆప్’ సినిమాకు ఆన్‍లైన్‍లో బాగానే ప్రమోషన్స్ చేసింది ఆహా ఓటీటీ. మొత్తానికి నేడు (మార్చి 15) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.

మిక్స్ అప్ చిత్రానికి ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించారు. హైమా వర్షిణి కథ అందించారు. తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కౌశిక్ సంగీతం అందించారు.

మిక్స్ అప్ స్టోరీ బ్యాక్‍డ్రాప్

ఆదర్శ్ - అక్షర గౌడ, కమల్ కామరాజ్ - పూజా.. ఈ చిత్రంలో పెళ్లయిన రెండు జంటలుగా నటించారు. శృంగారపరంగా వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దీంతో ఆ దంపతుల మధ్య రిలేషన్ దెబ్బ తింటుంది.

ఈ విషయంపై వారు ఓ స్పెషలిస్ట్ దగ్గరికి వెళతారు. దీంతో విడిపోయేందుకు తొందరపడకుండా కొంత సమయం తీసుకోవాలని ఆ రెండు జంటలకు ఆమె సూచిస్తారు. ఆ తర్వాత ఆ నలుగురి మధ్య అనూహ్య విషయాలు జరుగుతాయి. సంఘర్షణ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రెండు జంటలు కలిసే ఉన్నాయా? ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? అనేదే మిక్స్ అప్ స్టోరీగా ఉంటుంది.

సోనీ లివ్‍లో భ్రమయుగం

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం సినిమా నేడు (మార్చి 15) ‘సోనీ లివ్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బంగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. సూపర్ నేచురల్ హారర్ చిత్రంగా భ్రమయుగం చిత్రాన్ని రాహుల్ సదాశివమ్ తెరకెక్కించారు.

భ్రమయుగం సినిమా ఫిబ్రవరి 15వ తేదీన మలయాళం భాషలో థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ విజయం సాధించింది. మమ్ముట్టి యాక్టింగ్, సదాశివమ్ టేకింగ్ అదిరిపోయాయి. దీంతో అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. దీంతో వారం తర్వాత తెలుగులోనూ థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు భ్రమయుగం సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్ కీలకపాత్రలు పోషించారు.

WhatsApp channel