Bramayugam Day 4 box office collection: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న భ్రమయుగం.. మోహన్ లాల్‌ను మించిన మమ్ముట్టి-bramayugam day 4 box office collection mammootty film overtakes mohan lal malaikottai vaaliban ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bramayugam Day 4 Box Office Collection: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న భ్రమయుగం.. మోహన్ లాల్‌ను మించిన మమ్ముట్టి

Bramayugam Day 4 box office collection: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న భ్రమయుగం.. మోహన్ లాల్‌ను మించిన మమ్ముట్టి

Hari Prasad S HT Telugu
Feb 19, 2024 11:15 AM IST

Bramayugam Day 4 box office collection: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లలో మోహన్ లాల్ మలైకొట్టాయి వాలిబన్ మూవీని మించిపోయింది.

బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న మమ్ముట్టి భ్రమయుగం మూవీ
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న మమ్ముట్టి భ్రమయుగం మూవీ

Bramayugam Day 4 box office collection: సుమారు నాలుగు దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న సీనియర్ నటుడు ఈ మధ్యే మరో కొత్త అవతారంలో భ్రమయుగం మూవీ చేసిన విషయం తెలుసు కదా. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.10 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

భ్రమయుగం కలెక్షన్ల వర్షం

రాహుల్ సదాశివన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ భ్రమయుగం మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మమ్ముట్టి నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో రోజురోజుకూ సినిమా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. నాలుగో రోజైన ఆదివారం (ఫిబ్రవరి 18) ఇండియాలో ఈ సినిమా రూ.3.9 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా నాలుగు రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.12.8 కోట్లుగా ఉన్నట్లు Sacnilk వెల్లడించింది.

ఆదివారం ఈ భ్రమయుగం ఒక రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేయడం గమనార్హం. మూడో రోజు శనివారం కంటే కూడా నాలుగో రోజు రూ.55 లక్షలు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. గత గురువారం (ఫిబ్రవరి 15) థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. తొలి రోజు రూ.3.1 కోట్లు సాధించింది. ఆ లెక్కన తొలి రోజు కంటే నాలుగో రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం మలయాళం మార్కెట్ లో భ్రమయుగం ఆక్యుపెన్సీ 67.62 శాతంగా ఉంది. ఒక్క కేరళలోనే నాలుగో రోజు రూ.2.7 కోట్లు వచ్చాయి.

మోహల్ లాల్ కంటే ఎక్కువే..

మరోవైపు మోహన్ లాల్ నటించిన మలైకొట్టాయి వాలిబన్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల కంటే ఈ భ్రమయుగం కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి మోహన్ లాల్ మూవీ తొలి రోజు రూ.5.65 కోట్లతో మంచి ఓపెనింగ్స్ రాబట్టినా.. సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో కలెక్షన్లు తర్వాతి రెండు రోజుల్లో దారుణంగా పడిపోయాయి.

ఈ మధ్యే మమ్ముట్టి కాదల్ ది కోర్ అనే మూవీతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతడు ఓ గే పాత్రలో కనిపించాడు. ఆ మూవీ తొలి నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.5.65 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడీ భ్రమయుగం అంతకు రెట్టింపు వసూళ్లు సాధించింది.

భ్రమయుగం ఓటీటీ

భ్రమయుగం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదల కావటంతో ఈ విషయం బయటికి వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుంది.

భ్రమయుగం చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి ఏప్రిల్‍లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిత్రానికి మలయాళంలో పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు సహా ఇతర భాషల్లోనూ సత్తాచాటుతుందనే అంచనాలు ఉన్నాయి.

భ్రమయుగం చిత్రంలో మమ్మూట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొత్తం బ్లాక్‍ అండ్ వైట్ ఫార్మాట్‍లోనే వచ్చింది.

Whats_app_banner