Malayalam Thriller Movies in OTT: ఓటీటీల్లో ఉన్న ఈ ఏడు మలయాళం థ్రిల్లర్ మూవీస్ చూశారా?-malayalam thriller movies in ott watch these 7 mollywood movies joji drishyam garudan kannur squad virus ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Thriller Movies In Ott: ఓటీటీల్లో ఉన్న ఈ ఏడు మలయాళం థ్రిల్లర్ మూవీస్ చూశారా?

Malayalam Thriller Movies in OTT: ఓటీటీల్లో ఉన్న ఈ ఏడు మలయాళం థ్రిల్లర్ మూవీస్ చూశారా?

Hari Prasad S HT Telugu
Feb 16, 2024 08:17 PM IST

Malayalam Thriller Movies in OTT: మలయాళ సినిమాలు ఇష్టపడే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఈ ఏడు మలయాళం థ్రిల్లర్ మూవీస్ ని మిస్ కాకుండా చూడండి.

ఓటీటీల్లోని థ్రిల్లర్ మలయాళం సినిమాల్లో ఒకటి వైరస్
ఓటీటీల్లోని థ్రిల్లర్ మలయాళం సినిమాల్లో ఒకటి వైరస్

Malayalam Thriller Movies in OTT: సౌత్ సినిమా అనే కాదు.. అసలు ఇండియన్ సినిమాలో భిన్నమైన కథలు, కథనాలతో మలయాళం సినిమాలు ఆకట్టుకుంటాయి. సింపుల్ స్టోరీని కూడా కట్టిపడేసేలా చెప్పడంలో మలయాళ మేకర్స్ ను మించిన వాళ్లు లేరు. ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే కొన్ని థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. ఆ సినిమాలేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

మలయాళ థ్రిల్లర్ మూవీస్ ఇవే

ఇప్పుడు చెప్పుబోయే 7 మలయాళ థ్రిల్లర్ మూవీస్ మీరు చూశారేమో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే వెంటనే ఆయా ఓటీటీల్లోకి వెళ్లి చూసేయండి. తెలుగు డబ్బింగ్ ఉంటే ఓకే. లేకపోయినా సబ్ టైటిల్స్ తోనూ ఆ మూవీస్ లోని థ్రిల్ ను ఎంజాయ్ చేయొచ్చు.

జోజి - ప్రైమ్ వీడియో

విలియం షేక్‌స్పియర్ రాసిన మ్యాక్‌బెత్ నాటకం ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా మూవీ జోజి. ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఇది. 2021 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. దిలీష్ పోతన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

వైరస్ - ప్రైమ్ వీడియో

2018లో కేరళను వణికించిన నిఫా వైరస్ ఆధారంగా తెరకెక్కిన మెడికల్ థ్రిల్లర్ మూవీ ఈ వైరస్. ఆషిక్ అబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019లో రిలీజైంది. కేరళలో నిఫా వైరస్ అసలు ఎలా మొదలైంది? ఆ సవాలును అక్కడి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది అన్న విషయాలను కళ్లకు కట్టినట్లు ఈ మూవీలో చూపించారు. ప్రైమ్ వీడియోలో వైరస్ మూవీ చూడొచ్చు.

గరుడన్ - ప్రైమ్ వీడియో

గరుడన్ ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అరుణ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైంది. ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది. ఓ విద్యార్థిని వేధించిన కేసును ఓ పోలీస్ ఆఫీసర్, ఓ ప్రొఫెసర్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇందులో చూపించారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కన్నూర్ స్క్వాడ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ గతేడాది రిలీజైంది. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాను ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.

దృశ్యం - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

దృశ్యం సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. వెంకటేశ్ తెలుగులో రీమేక్ చేశాడు. అయితే మలయాళంలో ఒరిజినల్ మూవీ చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

రోర్షాక్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. 2022లో వచ్చిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. తన జీవితం నాశనం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే వ్యాపారవేత్త కథే ఈ రోర్షాక్.

జోసెఫ్ - ప్రైమ్ వీడియో

జోజూ జార్జ్ లీడ్ రోల్లో నటించిన మూవీ జోసెఫ్. ఇదొక మర్డర్ మిస్టరీ మూవీ. నలుగురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా 2018లో రిలీజ్ కాగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024