Malayalam Murder Mystery Movies: మలయాళంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ మూవీస్ చూశారా?-malayalam murder mystery movies to watch in otts tovino thomas anweshippin kandethum ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Murder Mystery Movies: మలయాళంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ మూవీస్ చూశారా?

Malayalam Murder Mystery Movies: మలయాళంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ మూవీస్ చూశారా?

Hari Prasad S HT Telugu
Feb 13, 2024 10:44 AM IST

Malayalam Murder Mystery Movies: ఈమధ్యే మలయాళంలో టొవినో థామస్ నటించిన మర్డర్ మిస్టరీ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇలాంటి ఇతర సినిమాలనూ ఓటీటీల్లో మీరు చూడొచ్చు.

మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్
మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్

Malayalam Murder Mystery Movies: మర్డర్ మిస్టరీ సినిమాలు మంచి థ్రిల్ పంచుతాయి. ఆ సినిమాలు ఏ భాషలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటిది ఎలాంటి కథనైనా తమదైన స్టైల్లో కొత్తగా చెప్పే మలయాళం మూవీ మేకర్స్ ఈ మర్డర్ మిస్టరీ మూవీస్ ని మరింత ఆసక్తికంగా మలచుతారు. ఈ మధ్యే ఆ భాషలో టొవినో థామస్ నటించిన అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అలాంటి మరిన్ని సినిమాలు ఏమున్నాయో చూద్దాం.

మలయాళ మర్డర్ మిస్టరీ సినిమాలు

టొవినో థామస్ నటించిన అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ గత వారం రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి ప్రస్తుతం ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉండటం విశేషం. రివ్యూలు కూడా చాలా వరకూ పాజిటివ్ గానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో గతంలో వచ్చిన దృశ్యంలాంటి మర్డర్ మిస్టరీ సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది.

యవనిక - యూట్యూబ్

1982లో మలయాళంలో వచ్చిన యవనిక మూవీ బెస్ట్ మర్డర్ మిస్టరీ సినిమాల్లో ఒకటి. కేజీ జార్జ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులకు థ్రిల్ పంచుతూనే ఉంది. అదిరిపోయే స్క్రీన్‌ప్లే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. తబలా వాయించే అయ్యప్పన్ (భరత్ గోపీ) కనిపించకుండా పోవడం, అతన్ని వెతికే క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జాకబ్ (మమ్ముట్టి) ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.

సీబీఐ ఫ్రాంఛైజీ

మలయాళంలో సీబీఐ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. ఇవన్నీ మర్డర్ మిస్టరీ సినిమాలే. 1988లో ఒరు సీబీఐ డైరీ కురిప్పుతో మొదలై 2022లో సీబీఐ 5: ది బ్రెయిన్ వరకూ ఈ సినిమాలు వచ్చాయి. మొదటి మూడు సినిమాలు ఒరు సీబీఐ డైరీ కురిప్పు, జాగ్రత్త, సేతురామ అయ్యర్ సీబీఐ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. చివరి రెండు సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. ఈ మూవీస్ అన్నింటిలోనూ మమ్ముట్టి నటించాడు. ఈ సినిమాలన్నీ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

ఉత్తరం - యూట్యూబ్

1989లో వీకే పవిత్రన్ డైరెక్షన్ లో మమ్ముట్టి నటించిన మూవీ ఉత్తరం. వాసుదేవన్ నాయర్ కథ రాసిన ఈ మర్డర్ మిస్టరీ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఓ మహిళ మరణం చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాకు అప్పట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దృశ్యం ఫ్రాంఛైజీ - ప్రైమ్ వీడియో

జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ నటించిన దృశ్యం ఫ్రాంఛైజీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. తెలుగులోనూ ఇదే పేరుతో రెండు సినిమాలు వచ్చాయి. వెంకటేశ్, మీనా నటించిన ఈ మూవీస్ బాగా ఆకట్టుకున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ సినిమాల థ్రిల్ ఎంజాయ్ చేయాలన్నా ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సినిమాలు చూడొచ్చు.

ఇవే కాకుండా ముఖం (Mukham), పలెరి మాణిక్యం: ఒరు పత్తిరకోలపత్తకత్తింటె కథ, ఈ తనుత వేలుప్పన్‌కలతు, ముంబై పోలీస్, అంజామ్ పతీరాలాంటి మర్డర్ మిస్టరీ సినిమాలు కూడా అలరిస్తాయి.