Kannur Squad OTT Release Date: మమ్ముట్టి కన్నూర్ స్క్వాడ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Kannur Squad OTT Release Date: మమ్ముట్టి కన్నూర్ స్క్వాడ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రానుంది.
Kannur Squad OTT Release Date: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ హిట్ మూవీ మొదట నవంబర్ 10 నుంచి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గురువారం (నవంబర్ 9) హాట్‌స్టార్ అఫీషియల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
ప్రస్తుతం తెలుగులో యాత్ర 2 మూవీలో నటిస్తున్న మమ్ముట్టి ఈ మధ్యే మలయాళంలో ఈ కన్నూర్ స్క్వాడ్ మూవీ చేశాడు. ప్రస్తుతానికి ఈ సినిమా మలయాళ వెర్షన్ ఓటీటీ రిలీజ్ మాత్రమే హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. తెలుగుతోపాటు మిగతా భాషల సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. రోబీ వర్గీస్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.
కన్నూర్ స్క్వాడ్‌లో అంతగా ఏముంది?
కథాంశాల ఎంపికలో డిఫరెంట్‌గా ఆలోచిస్తుంటారు మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి. ఇమేజ్, స్టార్‌డమ్‌కు అతీతంగా ఎవరూ ఊహించిన కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. మమ్ముట్టి నుంచి వచ్చిన మరో వైవిధ్యమైన ప్రయత్నమే కన్నూర్ స్క్వాడ్ మూవీ.
రియలిస్టిక్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీని తెరకెక్కించాడు. కన్నూర్ స్వ్కాడ్ పేరుతో నిజంగానే కేరళలో ఓ స్పెషల్ పోలీస్ టీమ్ ఉండేది, ఆ టీమ్ సాల్వ్ చేసిన క్రైమ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
కన్నూర్ స్క్వాడ్ ఓ సినిమాలా కాకుండా పోలీసులు ఇన్వేస్టిగేషన్‌ను నిజంగానే చూస్తున్న అనుభూతి కలుగుతుంది. క్రైమ్ అంశాలతో పాటు వృత్తికి, వ్యక్తిగత బాధ్యతలకు మధ్య పోలీసులకు ఎదుర్కొనే సంఘర్షణను ఈ సినిమాలో చూపించారు.
ఓ క్రిమినల్‌ను కన్నూర్ స్క్వాడ్ పట్టుకునే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. అదే టైమ్‌లో మరో మిస్టరీ కేసు వారికి ఎదురవ్వడం, ఆ తర్వాత టీమ్‌లోని ఓ సభ్యుడు లంచం తీసుకోవడం స్వ్కాడ్ మొత్తం విడిపోయే సన్నివేశాలతో ఈ సినిమా నడుస్తుంది. అబ్దుల్ వహాబ్ మర్డర్‌తోనే అసలు సినిమా మొదలవుతుంది. ఈ మర్డర్ కేసును జార్జ్ టీమ్ చేపట్టిన తర్వాత జరిగే ఇన్వేస్టిగేషన్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
టాపిక్