Aavesham teaser: ఫహాద్ ఫాజిల్ ఆవేశం టీజర్.. కామెడీ రోల్లో అదరగొట్టిన యాక్టర్-aavesham teaser released fahadh faasil in a comedy avatar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Teaser: ఫహాద్ ఫాజిల్ ఆవేశం టీజర్.. కామెడీ రోల్లో అదరగొట్టిన యాక్టర్

Aavesham teaser: ఫహాద్ ఫాజిల్ ఆవేశం టీజర్.. కామెడీ రోల్లో అదరగొట్టిన యాక్టర్

Hari Prasad S HT Telugu
Jan 24, 2024 05:39 PM IST

Aavesham teaser: మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ టీజర్ బుధవారం (జనవరి 24) రిలీజైంది. కామెడీ రోల్లో ఫహాద్ డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ సినిమా.. అంచనాలు పెంచేసింది.

ఆవేశం మూవీలో ఫహాద్ ఫాజిల్
ఆవేశం మూవీలో ఫహాద్ ఫాజిల్

Aavesham teaser: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు ఓ కామెడీ రోల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతేడాది రొమాంచం పేరుతో హారర్ కామెడీ మూవీ అందించిన మేకర్సే ఇప్పుడు ఆవేశం పేరుతో మరో సినిమా తీశారు. తాజాగా బుధవారం (జనవరి 24) ఈ ఆవేశం టీజర్ రిలీజైంది.

ఇందులో ఓ సరికొత్త అవతారంలో ఫహాద్ కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లూ తెలుగు, తమిళం మూవీస్ లో మాస్ పాత్రల్లో నటించిన ఫహాద్.. తొలిసారి ఓ డిఫరెంట్ పాత్రతో వస్తుండటం విశేషం.

ఆవేశం టీజర్ ఎలా ఉందంటే?

ఆవేశం టీజర్ బుధవారం (జనవరి 24) రిలీజైంది. ఇందులో ఫహాద్.. రంగా అనే పాత్రలో కనిపించాడు. గుండుతో ఎప్పుడూ సన్ గ్లాసెస్ ధరించి టీజర్లో కనిపించిన ఫహాద్.. కామెడీ రోల్లోనూ అదరగొట్టేశాడు. కామెడీ పాత్రలో కనిపించే రంగాకు ఓ వయోలెంట్ గతం కూడా ఉంటుంది. ఓ జ్యూస్ షాపులో పని చేసే అతడు.. అక్కడికి వచ్చి వేధిస్తున్న గూండాలు, వాళ్ల లీడర్ ను హత్య చేసి ఓ పెద్ద డాన్ గా మారతాడు.

ఓవైపు నవ్వస్తూనే మరోవైపు సీరియస్ గూండాగా ఫహాద్ నటించడం విశేషం. మూవీ టైటిల్, అందులో ఫహాద్ కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ ఆవేశం మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. విషు, ఈద్ లక్ష్యంగా ఆ సమయంలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ది గోట్ లైఫ్ కూడా రిలీజ్ కానుంది.

దీంతో ఆవేశం మూవీకి గట్టి పోటీ ఉండనుంది. అయితే మూవీ టీజర్ మాత్రం అభిమానులకు బాగా నచ్చేసింది. ఈ ఏడాది మలయాళంలో మరో పెద్ద హిట్ రాబోతోందని ఈ టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విషూ పండుగకు బ్లాక్ బస్టర్ ఖాయమని మరో అభిమాని అన్నారు.

ఈ ఏడాది ఈ ఆవేశమే కాదు.. పాన్ ఇండియా మూవీ పుష్ప ది రూల్ తోనూ ఫహాద్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పుష్ప తొలి పార్ట్ చివర్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించిన ఫహాద్.. సెకండ్ పార్ట్ లో మరింత ఎక్కువ సమయం కనిపించనున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా తమిళంలో వెట్టాయిన్, మలయాళంలో పాట్టు అండ్ మారీశన్ సినిమాల్లోనూ అతడు నటిస్తున్నాడు.