Pushpa 2 Fahadh Faasil Look : పుష్ప 2 నుంచి షెకావత్ సర్ లుక్ విడుదల.. కాస్త షారుఖ్ లుక్ లాగే..-pushpa 2 makers unveil the first look of fahadh faasil netizens compares with shah rukh khan jawan look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Fahadh Faasil Look : పుష్ప 2 నుంచి షెకావత్ సర్ లుక్ విడుదల.. కాస్త షారుఖ్ లుక్ లాగే..

Pushpa 2 Fahadh Faasil Look : పుష్ప 2 నుంచి షెకావత్ సర్ లుక్ విడుదల.. కాస్త షారుఖ్ లుక్ లాగే..

Anand Sai HT Telugu

Pushpa 2 Fahad Fasil Look : పుష్ప 2 సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ గా సిగరెట్ కాలుస్తూ.. కనిపిస్తున్నాడు ఫహాద్.

పుష్ప 2లో పహద్ ఫాసిల్ (Twitter)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్(Sukumar) తీస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్. పుష్ప ది రైజ్‌కి సీక్వెల్ ఈ చిత్రం. పుష్ప 2 చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఫహద్ ఫాసిల్ 41వ పుట్టినరోజు(Fahad Faasil Birthday) సందర్భంగా పుష్ప 2 లుక్(Pushpa 2 Look) విడుదల చేశారు. ఫహద్ ఫాసిల్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఫహద్ ఫాసిల్ సిగరెట్ తాగుతున్నట్లుగా ఉంది. స్టైలిష్, కాన్ఫిడెంట్ గా ఫహద్ కనిపిస్తున్నాడు. ఈ ఫొటోను చూస్తే.. పుష్ప 2లో పుష్పతో షెకావత్ పెద్ద యుద్ధమే చేసేటట్టుగా ఉన్నాడు. అయితే ఫహద్ లుక్.. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో లుక్ లాగే ఉందని కొంతమంది అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తుండగా, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు. పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 2022లో ప్రారంభమైంది. షూటింగ్ కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. దర్శకుడు సుకుమార్(Director Sukumar) కథ, సినిమాటోగ్రఫీలో మార్పులు చేర్పులు చేయడంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. పుష్ప 2 ట్రైలర్ మూడు నెలల క్రితం విడుదలైంది. ట్రైలర్ చూసిన చాలా మంది సినిమా షూటింగ్ అయిపోయిందని అనుకున్నారు. కానీ ఇంకా పూర్తి కాలేదు, రెండో దశ షూటింగ్ ఇప్పుడే మొదలైంది.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ దగ్గర పడింది. కానీ పాటల షూటింగ్, కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. కొన్ని ఫైట్స్ కూడా చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సుమారు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉంది. దీంతో విడుదల ఆలస్యమవుతుందా అని చర్చ మెుదలైంది. ఇప్పటికే.. మేలుకో పుష్ప అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు బన్నీ ఫ్యాన్స్.