Sukumar on Baby: బేబి మూవీపై సుకుమార్ ప్రశంసలు.. వైష్ణవి క్యారెక్టర్‌ ఐకానిక్ అంటూ..-director sukumar gives his review on baby movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Director Sukumar Gives His Review On Baby Movie

Sukumar on Baby: బేబి మూవీపై సుకుమార్ ప్రశంసలు.. వైష్ణవి క్యారెక్టర్‌ ఐకానిక్ అంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 19, 2023 03:22 PM IST

Sukumar on Baby: బేబి సినిమాపై దర్శకుడు సుకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘంగా క్యాప్షన్ పోస్ట్ చేశాడు.

బేబి మూవీపై సుకుమార్ ప్రశంసలు
బేబి మూవీపై సుకుమార్ ప్రశంసలు

Sukumar on Baby: బేబి సినిమాకు భారీ కలెక్షన్‍లతో పాటు ప్రశంసలు కూడా వెల్లువలా వస్తున్నాయి. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.38.2 కోట్ల వసూళ్లను (గ్రాస్) సాధించి భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ ‘బేబి’ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. కలర్ ఫొటో చిత్రానికి కథను అందించిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్.. బేబి చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. నటీనటులతో పాటు చిత్ర యూనిట్‍ను ప్రశంసించాడు. ఆ వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

బేబి చిత్రం కథ, తెరకెక్కించిన విధానం, డైరెక్షన్‍పై సుకుమార్ ప్రశంసలు కురిపించాడు. “చాలా కాలం తర్వాత ఓ విభిన్నమైన, అసాధారణమైన రైటింగ్‍ను చూశాను. ఈ మూవీ కచ్చితంగా సినిమాలను రాసే విధానంలో కొత్త వేవ్‍ను, కొత్త ప్యాటర్న్ ను తీసుకొస్తుంది. ప్రతీ సీన్ నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌గా అనిపించింది. సినిమాలో క్యారెక్టర్లు.. పరిస్థితుల్లా ప్రవర్తించాయి. అలాంటి దాన్ని నేను తొలిసారి చూశా. సాయి రాజేశ్ అద్భుతం చేశాడు. ఇంత అసాధరణమైన సినిమాను నమ్మి, ప్రోత్సహించిన ఎస్‍కేఎన్, మారుతిలను నేను అభినందిస్తున్నా” అని సుకుమార్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు. ఈ మూవీలో వైష్ణవి క్యారెక్టర్ గురించి కూడా పొగిడాడు. “ఇప్పటి వరకు వచ్చిన ఐకానిక్ పాత్రల్లో వైష్ణవి క్యారెక్టర్ కూడా ఒకటిగా నిలిచిపోతుంది. ఆ పాత్రకు వైష్ణవి పూర్తి న్యాయం చేసింది. ఊపిరి పోసింది. ఆనంద్ కూడా తన పాత్రలో అద్భుతంగా చేశాడు. విరాజ్ కూడా చాలా బాగా చేశాడు” అని సుకుమార్ రాసుకొచ్చాడు.

“విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ ఓ అందమైన విజువల్‍లా ఉంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. ఈ సినిమాకు మెలోడియస్ ట్యూన్‍లా ఉంది. గ్రాండ్ సక్సెస్ సాధించిన బేబి మూవీ టీమ్ మొత్తానికి కాంగ్రాచులేషన్స్” అని సుకుమార్ రాసుకొచ్చాడు.

జూలై 14న విడుదలైన బేబి సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యూత్‍లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఏకంగా ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.38కోట్ల గ్రాస్‍ కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‍లోనూ మంచి కలెక్షన్‍లను సాధిస్తోంది. సాయి రాజేశ్ డైరెక్షన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం కూడా ఈ చిత్రానికి ఓ హైలైట్‍గా ఉంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 - ది రూల్ చిత్రానికి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నాడు సుకుమార్.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.