Dhoomam Trailer: ఫహద్ ఫాసిల్ ధూమమ్ ట్రైలర్.. కేజీఎఫ్, కాంతారా మేకర్స్ నుంచి మరో వండర్-dhoomam trailer released by hombale films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhoomam Trailer: ఫహద్ ఫాసిల్ ధూమమ్ ట్రైలర్.. కేజీఎఫ్, కాంతారా మేకర్స్ నుంచి మరో వండర్

Dhoomam Trailer: ఫహద్ ఫాసిల్ ధూమమ్ ట్రైలర్.. కేజీఎఫ్, కాంతారా మేకర్స్ నుంచి మరో వండర్

Hari Prasad S HT Telugu
Jun 08, 2023 01:48 PM IST

Dhoomam Trailer: ఫహద్ ఫాసిల్ ధూమమ్ ట్రైలర్ వచ్చేసింది. కేజీఎఫ్, కాంతారా మేకర్స్ హోంబళే ఫిల్మ్స్ నుంచి వస్తున్న మరో వండర్ ఇది. ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ధూమమ్ ట్రైలర్ రిలీజ్
ధూమమ్ ట్రైలర్ రిలీజ్

Dhoomam Trailer: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కేజీఎఫ్, కాంతారా మేకర్స్ కలిసి తీసిన మూవీ ధూమమ్. తాజాగా గురువారం (జూన్ 8) ఈ ధూమమ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళం, కన్నడలలో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు భాషల్లోనూ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

కేజీఎఫ్, కాంతారా మేకర్స్ హోంబళే ఫిల్మ్స్ ఈ ధూమమ్ మూవీని తెరకెక్కించింది. ఇదొక థ్రిల్లర్ మూవీలాగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ఫహద్ క్యారెక్టర్ పరిచయంతో మొదలవుతుంది. తాను రూపొందించిన స్మోకింగ్ వార్నింగ్ యాడ్ ను ఫహద్ బోర్డు మెంబర్స్ కు వివరిస్తూ ఉంటాడు. ఆ వెంటనే ట్రైలర్ కాస్తా కిడ్నాపింగ్, యాక్షన్, చేజింగ్ సీన్ల వైపు తిరుగుతుంది.

ట్రైలర్ ను మేకర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మూవీ మొత్తం ట్విస్టులతో థ్రిల్ పంచేలా ఉంది. నిజానికి ఈ సినిమాను కన్నడలోనే తీయాలని డైరెక్టర్ పవన్ భావించాడట. అయితే అది కుదరకపోవడంతో మలయాళంలో ఈ మూవీ తీసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

కన్నడలో నటులు ఈ స్టోరీతో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడం, ప్రొడ్యూసర్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో తాను మలయాళంలో తీసినట్లు పవన్ తెలిపాడు. అయితే మలయాళంలో మాత్రం ఫహద్, రోషన్, అపర్ణ బాలమురళీలాంటి నటీనటులు ఈ మూవీ చేయడం విశేషం. కన్నడలో లూసియా, యూటర్న్ లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్ ఈ పవన్ కుమార్.

"ఫహద్ ఈ సినిమాలో తన అత్యుత్తమ నట కనబరిచాడు. అతని స్థానంలో మరొకరిని నేను ఊహించలేను. అపర్ణ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది" అని పవన్ చెప్పాడు. ఈ ధూమమ్ మూవీ జులైలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner