Malaikottai Vaaliban OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతోన్నమోహన్‌లాల్ హిస్టారికల్ మూవీ
Malaikottai Vaaliban OTT: మోహన్‌లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ మలైకోటైవాలిబన్ మూవీ తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
Malaikottai Vaaliban OTT: మోహన్‌లాల్ కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా మలైకొటై వాలిబాన్ మూవీ తెరకెక్కింది. జల్లికట్టు ఫేమ్ లిజో సోజ్ పెల్లిసరీ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్, లిజో జోస్ కాంబోపై ఉన్న క్రేజ్ కారణంగా షూటింగ్ ప్రారంభం నుంచి ఈ సినిమాపై భారీగా హైప్ నెలకొంది. కానీ ఆ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ చతికిలాపడింది. థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ వారి ప్లాన్ ఫలించలేదు.
డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్...
మలైకొటై వాలిబాన్ తెలుగు వెర్షన్ థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిలీజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
మోహన్ లాల్ డ్యూయల్ రోల్...
మలైకోటై వాలిబాన్‌లో మోహన్‌లాల్ డ్యూయల్ రోల్ చేశాడు. మలైకోటై వాలిబాన్, మలైవేటై వాలిబాన్ అనే పాత్రల్లో అతడి యాక్టింగ్, చూపించిన వేరియేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే పేరొచ్చిన దర్శకుడు కథను కన్ఫ్యూజన్‌గా చెప్పడంతో సినిమా పరాజయం పాలైంది. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇరవై ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్‌గా మిగిలింది. మోహన్ లాల్ కెరీర్‌తో పాటు రీసెంట్ టైమ్‌లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
బ్రిటీష్ వారిపై పోరాటం...
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబన్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు ఎలా హీరోగా నిలిచాడు అన్నదే ఈ మూవీ కథ.
రాధికా ఆప్టే అనుకున్నారు కానీ...
ఈ సినిమాలో మరాఠీ నటి సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది. తొలుత మలైకోటై వాలిబాన్‌లో రాధికా ఆప్టేను హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమె డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో సోనాలి కులకర్ణిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. హరీష్ పేరడి, డాషిన్ సైత్ కీలక పాత్రలు పోషించారు.
కన్నప్పతో రీఎంట్రీ...
గత ఏడాది నేరు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్టర్ అందుకున్నాడు మోహన్ లాల్. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్ జైలర్‌లో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేశాడు. ఎలోన్ పేరుతో సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగం చేశాడు. ఈ ఏడాది బారోజ్ మూవీతో దర్శకుడిగా మారబోతున్నాడు మోహన్ లాల్. అతడు హీరోగా నటిస్తూ దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లూసిఫర్ సీక్వెల్‌తో పాటు మలయాలంలో వృషభ సినిమా చేస్తున్నాడు మోహన్‌లాల్. తెలుగులో మంచు విష్ణు భక్త కన్నప్పలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.