OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా..-ott releases telugu movies this week naa saami ranga and bhamakalapam 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా..

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 13, 2024 04:46 PM IST

OTT Releases This Week - Telugu movies: ఈ వారంలో ఓటీటీలోకి మరిన్ని చిత్రాలు అడుగుపెడుతున్నాయి. తెలుగులో ముఖ్యంగా రెండు సినిమాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఆ వివరాలివే..

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా..
OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా..

OTT Releases: ఈ వీకెండ్‍లో ఓటీటీలో నయా తెలుగు సినిమాలు చూడాలనుకుంటున్న వారికి మరిన్ని చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫిబ్రవరి మూడో వారంలో ముఖ్యంగా రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ ఓటీటీలో అడుగుపెట్టనుంది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. అలాగే, డబ్బింగ్‍లో మరో మూవీ కూడా వస్తోంది. అలా.. ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నా సామిరంగ

కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో రిలీజై హిట్ అయింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన నా సామిరంగ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్టీమింగ్‍కు రానుంది.

నా సామిరంగ చిత్రంలో అషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 17 నుంచి చూసేయవచ్చు.

భామాకలాపం 2

సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం 2’ చిత్రం నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేయనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది. 2022లో వచ్చిన భామాకలాపం చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు భామాకలాపం 2 వస్తోంది. ఈ మూవీలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్ కూడా కీలకపాత్రలు చేశారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించారు. ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో భామాకలాపం 2 వీక్షించవచ్చు.

ది కేరళ స్టోరీ

అత్యంత వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. గతేడాది మేలో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఇప్పుడు సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రూ.20 కోట్ల బడ్జెట్‍తో వచ్చిన ఈ కేరళ ఫైల్స్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే, అత్యంత వివాదాస్పదం కూడా అయింది. ది కేరళ స్టోరీ చిత్రం జీ5లో ఫిబ్రవరి 16న తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి రానుంది.

సలార్ - హిందీ వెర్షన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ హిందీ వెర్షన్ డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే సలార్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రం హాట్‍స్టార్‌లో అడుగుపెడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా సలార్ వచ్చింది.

IPL_Entry_Point