Bhamakalapam 2 Trailer: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఓటీటీ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. బంగారు కోడి కోసం..-ott news priyamani starrer bhamakalapam 2 trailer released this movie set to stream on aha from februry 16 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott News Priyamani Starrer Bhamakalapam 2 Trailer Released This Movie Set To Stream On Aha From Februry 16

Bhamakalapam 2 Trailer: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఓటీటీ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. బంగారు కోడి కోసం..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 10, 2024 07:03 PM IST

Priyamani Bhamakalapam 2 Trailer: భామాకలాపం 2 ట్రైలర్ వచ్చేసింది. ఆహా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో యాక్షన్ కూడా బాగానే ఉన్నట్టు అర్థమవుతోంది.

Bhamakalapam 2 Trailer: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఓటీటీ మూవీ ట్రైలర్ వచ్చేసింది
Bhamakalapam 2 Trailer: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఓటీటీ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Bhamakalapam 2 Trailer Released: 2022లో వచ్చిన భామాకలాపం ఓటీటీ సినిమా చాలా పాపులర్ అయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత దానికి సీక్వెల్‍గా ‘భామాకలాపం 2’ మూవీ వస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ తరుణంలో నేడు (ఫిబ్రవరి 10) భామాకలాపం 2 ట్రైలర్‌ను ఆహా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. వివరాలివే..

డేంజరస్ వైఫ్ అనుపమ (ప్రియమణి) తాను యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో అనుపమ ఘుమఘుమ అనే హోటల్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయాన్ని భర్తకు చెబుతుంది. ఈ సీన్‍తోనే భామాకలాపం 2 ట్రైలర్ షురూ అయింది. ఈ తరుణంలోఓ కుకింగ్ ఐడల్ షోకు అనుపమ సెలెక్ట్ అవుతారు. ఆ పోటీలో గెలిచిన వారికి బంగారు కోడిపుంజు బహుమతిగా ఉంటుంది. అయితే, దాన్ని దొంగలించేందుకు ఓ మాఫియా గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది.

మర్డర్.. దొంగతనం

అయితే, ఈ క్రమంలో అనుపమ హోటల్‍లో ఓ శవం కనిపిస్తుంది. మర్డర్‌లో ఆమె ఇరుక్కుంటారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తమ కోసం బంగారు కోడిపుంజు దొంగతనం చేయాలని రౌడీలు.. అనుపమను బెదిరిస్తారు. “అన్ని దారులు మూసుకుపోయాయి అక్క. మర్డర్ కన్నా దొంగతనం చిన్నతప్పేమో?” అని అనుపమను శిల్ప (శరణ్య ప్రదీప్) కన్వీన్స్ చేస్తుంది. ఆ తర్వాత సీరత్ కపూర్ ఎంట్రీ ఉంది. అనంతరం కుకింగ్ కాంపిటిషన్ మొదవుతుంది.

దీంతో, ఆ తర్వాత దొంగతనం చేసేందుకు అనుపమ, శిల్ప ప్లాన్‍లు చేస్తారు. చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. “70mmలో మహాభారతం చూపించావు. క్యారెక్టర్ కాస్త కన్ ఫ్యూజింగ్‍గా ఉంది. సత్యవతివా.. కుంతివా.. లేక శిఖండివా..” అని విలన్ అంటే.. “ఓ మామూలు హౌస్‍వైప్‍ను” అని అనుపమ చెబుతుంది. టీవీలో మొత్తం నీ గురించే చూపిస్తున్నారని భర్త అంటే.. “అక్కడ జరిగింది ఒకటి వీళ్లు చూపించేది ఒకటి” అని కవర్ చేసుకుంటారు అనుపమ. నేషనల్ అవార్డు విన్నింగ్ నటి అని శిల్ప చెప్పే డైలాగ్‍తో భామాకలాపం 2 ట్రైలర్ ముగిసింది.

భామాకలాపం 2 ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈసారి యాక్షన్ కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. డేంజరస్ వైఫ్‍ అనుపమగా ప్రియమణి మరోసారి అదరగొట్టారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

భామాకలాపం 2 చిత్రానికి అభిమన్యు తాడమేటి దర్శకత్వం వహించారు. బంగారు కోడి పుంజు దొంగతనం చుట్టూ ఈ కథ ఇంట్రెస్టింగ్‍గా సస్పెన్స్‌తో ఉండనున్నట్టు ట్రైలర్ అంచనాలను పెంచింది. ప్రశాంత్ ఆర్ విహారీ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంది. సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, అనూజ్ గురువార్ ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.

“కుకింగ్.. మర్డర్.. దోపీడీ.. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‍మెంట్ వేచిచూస్తోంది. డేంజరస్ వైఫ్ అలియాజ్ అనుపమ.. రుచికరమైన హీస్ట్ ఫీస్ట్ అందించేందుకు మళ్లీ వచ్చేశారు. ట్రైలర్ వచ్చేసింది. ఫిబ్రవరి 16న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది” అని ఆహా ఓటీటీ ప్లాట్‍‍ఫామ్ ట్వీట్ చేసింది.

IPL_Entry_Point