OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న హిందీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ప్రకటించిన కరణ్ జోహార్..-ae watan mere watan ott release date announced by karan johar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న హిందీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ప్రకటించిన కరణ్ జోహార్..

OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న హిందీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ప్రకటించిన కరణ్ జోహార్..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 13, 2024 05:46 PM IST

Ae Watan Mere Watan OTT Release: ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉండనుంది. వివరాలివే..

డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న హిందీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ప్రకటించిన కరణ్ జోహార్..
డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న హిందీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ప్రకటించిన కరణ్ జోహార్..

Ae Watan Mere Watan Movie: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍‍ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. భారత దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉండనుంది. రేడియో ఛానెల్‍ను నడిపే మహిళ పాత్రను ఏ వతన్ మేరే వతన్ మూవీలో చేశారు సారా.

ఏ వతన్ మేరే వతన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా (ఫిబ్రవరి 13) నేడు ఈ డేట్‍ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీకి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. యదార్థ ఘటనల స్ఫూర్తిగా కల్పిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

“అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా ఓ ముఖ్యమైన సమాచారాన్ని మీ కోసం తీసుకొచ్చాం. ఏ వతన్ మేరే వతన్ సినిమా మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది” అని కరణ్ జోహార్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో సారా అలీఖాన్ ఫస్ట్ లుక్‍ను కూడా రివీల్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.

బ్రిటీష్ పాలన సమయంలో రేడియో ఛానెల్ నిర్వహించిన ‘ఉష’ అనే మహిళ స్ఫూర్తిగా ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం రూపొందింది. ఉష పాత్ర చేసిన సారా రేడియో అనౌన్స్‌మెంట్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు.

స్వాతంత్య్ర పోరాటాన్ని ఓ రేడియో ఛానెల్ ఎలా మార్చిందనే అంశంతో ఏ వతన్ మేరే వతన్ స్టోరీ వస్తోంది. ఇది ఫిక్షనల్ కథే అయినా.. కొన్ని యథార్థ ఘటనలకు స్ఫూర్తిగా తీసుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఉషా మెహతా స్ఫూర్తిగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మహోన్నతమైన దేశభక్తి, త్యాగం, పోరాట పటిమ చూపిన కొందరు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళిగా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ తెలిపారు.

ఏ వతన్ మేరే వతన్ చిత్రానికి దారబ్ ఫరూకీ, అయ్యర్ కథను అందించగా.. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడ్‍కర్, అభయ్ వర్మ, స్పర్శ్ శ్రీవాత్సవ్, అలెక్స్ ఓనీల్, ఆనంద్ తివారీ కీలకపాత్రలు పోషించారు. ఇమ్రాన్ హష్మి అతిథి పాత్రలో కనిపించనున్నారు. డ్రమాటిక్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమేన్ మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.

పోచర్ సిరీస్ గురించి..

దేశంలోని వణ్యప్రాణులపై జరిగిన దాడుల గురించి ‘పోచర్’ అనే ఓ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఎమీ అవార్డు విజేత రిచీ మెహతా ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. ఈ సిరీస్‍కు సహ నిర్మాతగా ఉన్నారు.

Whats_app_banner