Sara Shubman Gill Dating: ఆ సారా నేను కాదు వదిలేయండి: శుభ్‌మన్, సారా డేటింగ్‌పై సారా అలీ ఖాన్-sara shubman gill dating rumours sara ali khan responds in koffee with karan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sara Shubman Gill Dating: ఆ సారా నేను కాదు వదిలేయండి: శుభ్‌మన్, సారా డేటింగ్‌పై సారా అలీ ఖాన్

Sara Shubman Gill Dating: ఆ సారా నేను కాదు వదిలేయండి: శుభ్‌మన్, సారా డేటింగ్‌పై సారా అలీ ఖాన్

Hari Prasad S HT Telugu

Sara Shubman Gill Dating: ఆ సారా నేను కాదు వదిలేయండి అంటూ శుభ్‌మన్ గిల్, సారా డేటింగ్‌పై బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ స్పందించింది. కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన ఆమె.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కాఫీ విత్ కరణ్ షోలో సారా అలీ ఖాన్, అనన్యా పాండే

Sara Shubman Gill Dating: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డేటింగ్ ఎవరితో చేశాడు? సారా అలీ ఖాన్ తోనా లేక సారా టెండూల్కర్‌తోనా? ఈ ప్రశ్నకు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సమాధానమిచ్చింది. సారా, గిల్ డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై కాఫీ విత్ కరణ్ షోలో ఈ సారా స్పందించింది. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సారా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఎపిసోడ్ కు సారా అలీ ఖాన్, అనన్య పాండే గెస్టులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కరణ్ జోహార్.. ఆ ఇద్దరి బాయ్‌‌ఫ్రెండ్స్ గురించి అడిగాడు. శుభ్‌మన్ గిల్ తో డేటింగ్ నిజమేనా అంటూ కరణ్ అడగటంతో ఆ సారా తాను కాదు సచిన్ కూతురు సారా అనే అర్థం వచ్చేలా ఆమె స్పందించింది.

ఆ సారా నేను కాదు: సారా అలీ ఖాన్

శుభ్‌మన్ గిల్ తో డేటింగ్ రూమర్స్ నిజమేనా అని కరణ్ అడిగాడు. దీనికి సారా స్పందిస్తూ.. "మీరు రాంగ్ సారాను పట్టుకున్నారు. మొత్తం ప్రపంచమంతా మరో సారా వెనుక పడింది" అని సారా అలీ ఖాన్ అనడం విశేషం. ఇలా పరోక్షంగా గిల్ తనతో కాదు సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ లో ఉన్నట్లు ఆమె చెప్పంది. ఈ తాజా ఎపిసోడ్ ప్రోమో వైరల్ అవుతోంది.

ఇక అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఉన్న రిలేన్షిప్ గురించి కూడా సారా పరోక్షంగా చెప్పింది. నైట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నావని కరణ్ అడిగితే.. అనన్య దగ్గర ది నైట్ మేనేజర్ ఉన్నాడు అని సారా ఆన్సర్ ఇచ్చింది. హాట్‌స్టార్ వెబ్ సిరీస్ నైట్ మేనేజర్ లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే.

నిజానికి వరల్డ్ కప్ లో టీమిండియా ఎక్కడికెళ్లి ఆడినా శుభ్‌మన్ గిల్ తో అభిమానులు ఆడుకుంటున్నారు. సారా సారా అని అరుస్తూ గిల్ ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్ కు సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం.