Koffee with Karan 8: ఈ తెలుగు హీరోలను ‘కాఫీ విత్ కరణ్’కు పిలవండి: కరణ్ జోహార్‌కు ఫ్యాన్స్ డిమాండ్-fans wants to see these telugu stars in koffee with karan 8 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koffee With Karan 8: ఈ తెలుగు హీరోలను ‘కాఫీ విత్ కరణ్’కు పిలవండి: కరణ్ జోహార్‌కు ఫ్యాన్స్ డిమాండ్

Koffee with Karan 8: ఈ తెలుగు హీరోలను ‘కాఫీ విత్ కరణ్’కు పిలవండి: కరణ్ జోహార్‌కు ఫ్యాన్స్ డిమాండ్

Koffee with Karan 8: కాఫీ విత్ కరణ్ టాక్ షోలో తెలుగు హీరోలను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ టాక్ షోకు తమ అభిమాన స్టార్లను పిలవాలంటూ కొందరు కరణ్ జోహార్‌ను కోరుతున్నారు.

కరణ్ జోహార్

Koffee with Karan 8: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో చాలా పాపులర్. ప్రస్తుతం ఈ టాక్ షో 8వ సీజన్ షురూ అయింది. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’ మొదలైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‍లో బాలీవుడ్ స్టార్ దంపతులు రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణ్ పాల్గొన్నారు. చాలా విషయాలు మాట్లాడారు. దీపికా చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’ డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ సీజన్‍కు తెలుగు హీరోలను కూడా పిలవాలని కొందరు అభిమానులు కరణ్ జోహార్‌కు డిమాండ్లు చేస్తున్నారు.

తెలుగు హీరోలను ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’కు తీసుకురావాలని కరణ్ జోహార్‌కు చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍ను కాఫీ విత్ కరణ్‍కు తీసుకురావాలని చాలా మంది కోరుతున్నారు. రామ్‍చరణ్, అతడి భార్య ఉపాసనను షోకు పిలవాలని అంటున్నారు.

కొందరైతే రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ ఒకేసారి కాఫీ విత్ కరణ్‍కు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలని సూచిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించిన ఇద్దరినీ తీసుకురావాలంటున్నారు. మరికొందరు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’లో చూడాలని అనుకుంటున్నామని అంటున్నారు. మరి, ఈ సీజన్ ‘కాఫీ విత్ కరణ్’కు తెలుగు హీరోలు ఎవరైనా వస్తారేమో చూడాలి.

సాధారణంగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో బాలీవుడ్ సెలెబ్రెటీలే పాల్గొంటుంటారు. గతంలో తెలుగు నుంచి స్టార్స్ ప్రభాస్, రానా దగ్గబాటి, దర్శక ధీరుడు ఎస్‍ఎస్ రాజమౌళి.. ‘కాఫీ విత్ కరణ్’షోలో కనిపించారు. ఇక మరే సౌత్ స్టార్స్ కూడా రాలేదు.