Poacher OTT Release Date: ఓటీటీలోకి రానున్న కొత్త క్రైమ్ సిరీస్.. డేట్ ఫిక్స్: ఎమీ అవార్డు విజేత డైరెక్షన్‍లో..
Poacher OTT Release Date: వణ్యప్రాణులపై దాడుల గురించి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్ రానుంది. పోచర్ పేరుతో ఈ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఎమీ అవార్డ్ విన్నర్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు.
Poacher OTT Release Date: క్రైమ్ సిరీస్ ‘పోచర్’ గురించి ప్రకటన వచ్చేసింది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్‌టైన్‍మెంట్ ఈ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేస్తోంది. ప్రతిష్టాత్మక ఎమీ అవార్డు విజేత రిచీ మెహతా.. ఈ పోచర్ సిరీస్‍కు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నిమిష సంజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ పోచర్ సిరీస్ గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.
‘పోచర్’ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇటీవల సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో ఈ సిరీస్‍లోని తొలి మూడు ఎపిసోడ్లను ప్రదర్శించగా.. విమర్శకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 23న ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది.
అడవుల్లో వణ్య ప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడులు, కుట్రల గురించి ప్రధానంగా ఈ పోచర్ క్రైమ్ సిరీస్ ఉండనుంది. అడవుల్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరిగింది. కొన్ని కోర్టు డాక్యుమెంట్స్, ఘటనల ఆధారంగా ఫిక్షనల్ డ్రామాతో ఈ సిరీస్ రూపొందుతోంది.
భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఏనుగు దంతాల నెట్‍వర్క్ గుట్టు రట్టు చేసేందుకు కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, భారత వణ్యప్రాణుల ట్రస్ట్ ఎన్‍జీవో వర్కర్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, మరికొందరు వ్యక్తుల కృషి ఈ పోచర్ వెబ్ సిరీస్‍లో ప్రధానంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. కేరళలోని రియల్ లైఫ్ లొకేషన్లలో, ఢిల్లీలో చిత్రీకరణ జరిగింది.
ఈ పోచర్ వెబ్ సిరీస్ కోసం నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్టు దర్శకుడు రిచీ మహతా చెప్పారు. థీమ్, క్యారెక్టర్ల గురించి వివరంగా తెలుసుకునేందుకు చాలా పని చేశామని అన్నారు.
ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‍కు కూడా గతంలో రిచీ మెహతా దర్శకత్వం వహించారు. 2012 ఢిల్లీ గ్యాంప్ రేప్ కేసు ఆధారంగా ఆ సిరీస్‍ను రూపొందించారు. ఈ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 2019లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. బాగా పాపులర్ అయింది.
ప్రైమ్‍లో డెవిల్ మూవీ..
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఇటీవలే ‘డెవిల్’ తెలుగు మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించారు. డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం 20 ముగియక ముందే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. డెవిల్ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటించగా.. మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొనెన్‍బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్ కీరోల్స్ చేశారు.
బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో డెవిల్ మూవీ వచ్చింది. మర్డర్ మిస్టరీ, ఆపరేషన్ టైగర్ హంట్ అనే అంశాల చుట్టూ థ్రిల్లర్‌లా తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు అభిషేక్ నామా. నిర్మాత కూడా ఆయనే. హర్షవర్దన్ రామేశ్వర్.. డెవిల్ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు.
టాపిక్