Captain Miller OTT: ఓటీటీలో కెప్టెన్ మిల్లర్‌కు సూపర్ రెస్పాన్స్- ట్రెండింగ్‍లో టాప్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే-captain miller become top trending movie on amazon prime video ott platform check netizens reactions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Captain Miller Ott: ఓటీటీలో కెప్టెన్ మిల్లర్‌కు సూపర్ రెస్పాన్స్- ట్రెండింగ్‍లో టాప్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే

Captain Miller OTT: ఓటీటీలో కెప్టెన్ మిల్లర్‌కు సూపర్ రెస్పాన్స్- ట్రెండింగ్‍లో టాప్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే

Captain Miller OTT Streaming: కెప్టెన్ మిల్లర్ సినిమా ఓటీటీలో దూసుకెళుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

Captain Miller OTT: కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ధనుష్

Captain Miller on OTT: పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద మోస్తరు హిట్ అయింది. అయితే, భారీ అంచనాలను అందుకోలేకపోయింది. తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీకి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. పొంగల్‍ సందర్భంగా జనవరి 12న కెప్టెన్ మిల్లర్ థియేటర్లలో రిలీజ్ అయింది. థియేట్రికల్ రన్ తర్వాత ఇటీవలే ఫిబ్రవరి 9న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

కెప్టెన్ మిల్లర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఫిబ్రవరి 9 నుంచి ఈ యాక్షన్ డ్రామా అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‍లో ఈ మూవీకి భారీ వ్యూవర్‌షిప్ వస్తోంది.

ట్రెండింగ్‍లో టాప్

సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో ఇండియా ట్రెండింగ్‍లో కెప్టెన్ మిల్లర్ టాప్‍లోకి వచ్చింది. నేషనల్ వైడ్‍లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍తో వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది.

కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్, అదితి బాలన్, ఎడ్వర్ట్ సొనెన్‍బ్లిక్, జాన్ కొక్కెన్, నివేదిత సతీశ్, వినోద్ కిషన్ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది.

నెటిజన్ల రియాక్షన్స్ ఇవే..

కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని థియేటర్లలో చూడకుండా.. ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని, థియేటర్లలో మిస్ అయ్యామని బాధపడుతున్నామని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. థియేటర్లో చూసినా మరోసారి ఓటీటీలో వీక్షించామని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. ధనుష్‍కు మరో జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని సీన్లలో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ టేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా ఓటీటీలో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తొలుత బ్రిటీష్ సైన్యంలో చేరి.. ఆ తర్వాత తమ ప్రాంతం, ప్రజల కోసం తిరుగుబాటు చేసే పాత్రను ఈ చిత్రంలో చేశారు ధనుష్. గౌరవం పొందాలనే ఉద్దేశంతో అగ్నీశ్వర్ అలియాజ్ అగ్ని (ధనుష్) బ్రిటీష్ సైన్యంలో చేరి.. కెప్టెన్ మిల్లర్ అనే పేరు తీసుకుంటాడు. అయితే, తన ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తున్నందుకు కొంతకాలానికి పశ్చాత్తాపపడతాడు. ఓ ఆర్మీ అధికారిని చంపి.. బ్రిటీష్ సైన్యం నుంచి అగ్ని వైదొలుగుతాడు. ఓ విప్లవ సంఘంలో చేరతాడు. తన గ్రామానికి చెందిన పురాతన విగ్రహాన్ని తీసుకెళ్లిన బ్రిటీష్ సైన్యంపై అగ్ని తిరుగుబాటు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కెప్టెన్ మిల్లర్ మూవీ ప్రధాన కథగా ఉంది. ఈ చిత్రంలో ధనుష్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సులు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్లుగా నిలిచాయి.