Captain Miller OTT Release Date: అఫీషియల్: ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Captain Miller OTT Release Date: కెప్టెన్ మిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అధికారికంగా ప్రకటన వచ్చింది.
Captain Miller OTT Release Date: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన కెప్టెన్ మిల్లర్ మూవీ మంచి హిట్ అయింది. పొంగల్ సందర్భంగా తమిళంలో జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే, సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగులో ఆలస్యమైంది. తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ మూవీ జనవరి 26వ తేదీన రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు, ఈ చిత్రం థియేటర్లలోకి రిలీజై నెల ముగియక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది.
కెప్టెన్ మిల్లర్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఫిబ్రవరి 9న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
కెప్టెన్ మిల్లర్ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. భారత స్వాతంత్య్రానికి కంటే ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ రూపొందింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని అరుణ్ తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి అంతా పాజిటివ్ టాక్ వచ్చింది.
కెప్టెన్ మిల్లర్‌తో నటుడిగా ధనుష్ మరో మెట్టు ఎక్కేశారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ చేశారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్, అదితి బాలన్, ఎడ్వర్ట్ సొనెన్‍బ్లిక్, జాన్ కొక్కెన్, నివేదిత సతీశ్, వినోద్ కిషన్, ఎలెక్సో ఓనెల్ కీలకపాత్రల్లో నటించారు.
కెప్టెన్ మిల్లర్ మూవీకి సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సులు కూడా మెప్పించాయి. సత్య జ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి నగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ చేశారు.
కెప్టెన్ మిల్లర్ కథ ఇదీ
బ్రిటీష్ పాలన కాలంలో కెప్టెన్ మిల్లర్ కథ సాగుతుంది. తన గ్రామంలో వివక్షను ఎదుర్కొంటూ అవమాన పడుతుండడం ఇష్టం లేక అగ్నీశ్వర్ అలియాజ్ అగ్ని (ధనుష్).. బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. దీంతో కెప్టెన్ మిల్లర్ అనే పేరు వస్తుంది. అయితే, తన ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటీషర్ల తరఫున పని చేస్తున్నందుకు కొంతకాలానికి అతడిలో పశ్చాత్తాపం ఏర్పడుతుంది. ఓ ఆర్మీ అధికారిని చంపి.. బ్రిటీష్ సైన్యం నుంచి అగ్ని బయటికి వస్తాడు. ఓ విప్లవ సంఘంలో చేరతాడు. తన గ్రామానికి చెందిన 600ఏళ్ల పురాతన విగ్రహాన్ని తీసుకెళ్లిన బ్రిటీష్ సైన్యంపై అగ్ని పోరాడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విగ్రహాన్ని అగ్ని తిరిగి తన గ్రామానికి తెచ్చాడా? భానుమతి (ప్రియాంక మోహన్) ఎవరు అనేదే కెప్టెన్ మిల్లర్ ప్రధాన కథగా ఉంది.
కెప్టెన్ మిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి రూ.100కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
టాపిక్