Dhanush DNS Shooting in Tirupathi: తిరుపతిలో ధనుష్ షూటింగ్.. ట్రాఫిక్ జామ్.. ఫొటో వైరల్-dhanush dns shooting in tirupathi nagarjuna rashmika shekhar kammula movie causes traffic jam telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush Dns Shooting In Tirupathi: తిరుపతిలో ధనుష్ షూటింగ్.. ట్రాఫిక్ జామ్.. ఫొటో వైరల్

Dhanush DNS Shooting in Tirupathi: తిరుపతిలో ధనుష్ షూటింగ్.. ట్రాఫిక్ జామ్.. ఫొటో వైరల్

Hari Prasad S HT Telugu
Jan 31, 2024 04:22 PM IST

Dhanush DNS Shooting in Tirupathi: ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న డీఎన్ఎస్ మూవీ షూటింగ్ తిరుపతిలో జరిగింది. ఇది భారీ ట్రాఫిక్ జామ్ కు దారి తీయడం గమనార్హం.

తిరుపతిలో డీఎన్ఎస్ మూవీ షూటింగ్ లో ధనుష్
తిరుపతిలో డీఎన్ఎస్ మూవీ షూటింగ్ లో ధనుష్ (X)

Dhanush DNS Shooting in Tirupathi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తిరుపతిలో చేసిన సినిమా షూటింగ్ భారీ ట్రాఫిక్ జామ్ కు కారణమైంది. ఇది కాస్తా అభిమానులు ఆగ్రహానికి దారి తీయడంతో మూవీ షూటింగ్ అర్ధంతరంగా ముగిసింది.

ప్రస్తుతం ధనుష్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన్నా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీని డీఎన్ఎస్ గా పిలుస్తున్నారు.

ధనుష్ తిరుపతి షూటింగ్

తిరుపతిలో ధనుష్ మూవీ షూటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్స్ తోపాటు ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఈ వీడియో తెగ చెక్కర్లు కొట్టింది. రోడ్డుపై ఓ ముష్టివాడి పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లుగా ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. రోడ్డుపై వెళ్లే వాళ్లు ధనుష్ ను గుర్తించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే తిరుపతి రోడ్లపై జరుగుతున్న ఈ షూటింగ్ వల్ల తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై షూటింగ్ తో ట్రాఫిక్ భారీగా స్పందించింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి వెళ్లే దారిలో మంగళవారం (జనవరి 30) ఈ షూటింగ్ జరిగింది. దీంతో మూవీ ప్రైవేట్ సెక్యూరిటీతోపాటు పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు.

ధనుష్ షూటింగ్ పూర్తి

రోడ్డుపై డీఎన్ఎస్ మూవీ షూటింగ్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తులు ఆగ్రహించడంతో ఈ మూవీ షూటింగ్ ను పోలీసులు ఆపేశారు. అయితే అప్పటికే తాము అనుకున్న షూటింగ్ పూర్తి చేసినట్లు మూవీ టీమ్ హిందుస్థాన్ టైమ్స్ తో చెప్పింది. "అవును, షూటింగ్ సమయంలో కాస్త ఇబ్బంది ఎదురైంది. కానీ శేఖర్ షూటింగ్ పూర్తి చేయగలిగాడు. పోలీసులు వల్ల షెడ్యూల్ కుదించినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు" అని మూవీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం డీఎన్ఎస్ షూటింగ్ లో ఇలా ఇబ్బందులు తలెత్తగా.. బుధవారం (జనవరి 31) ఉదయం ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. సాంప్రదాయ ధోతీలో అతడు తిరుమల ఆలయంలోకి వెళ్లి వచ్చాడు. ధనుష్ బయటకు రాగానే ఫ్యాన్స్ అతనితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

డీఎన్ఎస్ మూవీ ఏంటి?

ఇక డీఎన్ ఎస్ మూవీ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ధనుష్ తోపాటు నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో మొదలైంది. మూవీకి టైటిల్ ఇంకా పెట్టలేదు. ప్రస్తుతానికి డీఎన్ఎస్ గా పిలుస్తున్నారు.

ఈ మధ్యే కెప్టెన్ మిల్లర్ మూవీలో నటించిన ధనుష్.. ఇప్పుడు తన 51వ సినిమా అయిన డీఎన్ఎస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళంలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాగా.. తెలుగులో జనవరి 26న రిలీజైంది. అయితే మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు.