IIT Tirupati Jobs 2024 : ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు - ఖాళీలు, ముఖ్య తేదీలివే
IIT Tirupati Recruitment Updates: పలు ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 29 తేదీతో ఆప్లికేషన్స్ గడువు ముగియనుంది.
IIT Tirupati Recruitment 2024: తిరుపతి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. పలు విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. జనవరి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఫిబ్రవరి 29వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి…..
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి.
ఉద్యోగాలు - .అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్),
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్
భర్తీ చేసే విభాగాలు - కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్.
అర్హతలు - సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి - 44 ఏళ్ల లోపు ఉండాలి. పలు
దరఖాస్తు - ఆన్ లైన్
దరఖాస్తుల స్వీకరణ - 24 జనవరి 3024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 29 ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.iittp.ac.in/
ఈమెయిల్ ఐడీ: facultyrmt_queries@iittp.ac.in
https://iittp.ac.in/recruitment ఈ లింక్ తో దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.
AP DME Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నట్లు నియామక బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఖాళీల వివరాలు:
సూపర్ స్పెషాలిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు -169 ఖాళీలు
బ్రాడ్ స్పెషాలిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 255 ఖాళీలు
వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి విజయవాడ డీఎంఈ ఆఫీసులో ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్ జరుగనుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://dme.ap.nic.in లేదా http://apmsrb.ap.gov.in/msrb వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని నియామక బోర్డు పేర్కొంది.