AP DME Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్-amaravati news in telugu ap dme 424 assistant professor in abroad super specialty notification released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dme Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్

AP DME Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్

Bandaru Satyaprasad HT Telugu
Jan 30, 2024 06:14 PM IST

AP DME Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు (Unsplash)

AP DME Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నట్లు నియామక బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఖాళీల వివరాలు

  • సూపర్ స్పెషాలిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు -169 ఖాళీలు
  • బ్రాడ్ స్పెషాలిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 255 ఖాళీలు

వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి విజయవాడ డీఎంఈ ఆఫీసులో ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ ఇన్‌ రిక్రూట్మెంట్ జరుగనుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://dme.ap.nic.in లేదా http://apmsrb.ap.gov.in/msrb వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని నియామక బోర్డు పేర్కొంది.

కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్ట్‌ మార్టం అటెండెంట్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,500, పోస్ట్‌మార్టం అటెండెంట్‌కు రూ.15వేల వేతనంగా నిర్ణయించారు. రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం ఇటీవల అనుమతించిన ఏడు పోస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వీటిలో ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ టెక్నిషియన్, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నిషియన్, పెర్‌ఫ్యూషనిస్ట్‌, అనస్తీషియా టెక్నిషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, బయో మెడికల్ టెక్నిషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఓటీ అసిస్టెంట్‌ ఉద్యోగాన్ని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మిగిలిన ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.

26 ఖాళీలు

కాకినాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్న మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అసిస్టెంట్ లైబ్రరేయిన్‌, హౌస్ కీపర్స్‌, వార్డెన్స్‌, అటెండర్స్‌, క్లాస్ రూమ్‌ అటెండర్స్, హెవీ వెహికల్ డ్రైవర్, క్లీనర్స్‌, వ్యాన్ అటెండర్స్‌, అయాలు, ల్యాబ్ అటెండర్స్‌, లైబ్రరీ అటెండర్స్‌ వంటి ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మొత్తం 26 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. అల్కహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌లో కౌన్సిలర్, ఆడియోమెట్రి టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్‌, స్పీచ్ థెరపిస్ట్, పెర్‌ఫ్యూషనిస్ట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యార్హతలతో పాటు అనుభవాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థులకు గరిష్ట వయసు 42ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47ఏళ్లుగా నిర్ణయించారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 52ఏళ్ల వరకు అనుమతిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 3వ తేదీలోగా డిడితో కలిపి సమర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం