AP Govt Jobs 2024 : వైద్యారోగ్య శాఖలో జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు - ఖాళీల వివరాలివే
Andhrapradesh Govt Jobs 2024 : ఏపీలో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా కడపలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం… పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Andhrapradesh Govt Jobs 2024 : గత కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. గ్రూప్ పోస్టుల భర్తీతో పాటు పలు శాఖాల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటనలను ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే జిల్లాల్లోని ఖాళీలను భర్తీ చేస్తోంది వైద్యారోగ్యశాఖ. చాలా జిల్లాల్లో ప్రకటనలు రాగా… తాజాగా కడప జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనుండగా… వీటిని ఔట్ సోర్సింగ్ ప్రతిపాదిపకన రిక్రూట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కడప(DMHO)
మొత్తం ఖాళీలు - 68
ఖాళీల వివరాలు - జనరల్ డ్యూటీ అటెండెంట్ 50 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ - 04, బార్బర్ - 02, ధోబీ- 02, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ - 04, ఓ.టి. అసిస్టెంట్ - 06 ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హతలు - పోస్టును అనుసరించి నోటిఫికేషన్ లో వివరాలను పేర్కొన్నారు. పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.
జీతం - రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు
వయోపరిమితి - 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
దరఖాస్తులు ప్రారంభం - 25 జనవరి, 2024.
దరఖాస్తులకు తుది గడువు - 30 జనవరి, 2024. (సాయంత్రం 5 గంటల లోపు)
పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పుట్లం పల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుల పరిశీలన - 31 జనవరి 2024 నుంచి 8 ఫిబ్రవరి, 2024.
ప్రివిజినల్ మెరిట్ లిస్ట్ - ఫిబ్రవరి 9 2024.
ఫైనల్ లిస్ట్ - 16 ఫిబ్రవరి 2024.
ఒరిజినల్ పత్రాల పరిశీలన -19 ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్ సైట్ - https://kadapa.ap.gov.in/